PAN-Aadhaar Link: గుర్తుందా.. ఇవాళే లాస్ట్ డేట్.. లింక్ చేస్తే రూ. 10 వేలు మిగిలినట్లే..

పాన్‌(PAN) ఆధార్(Aadhaar) లింక్ చేయడానికి ఇక సమయం లేదు.. ఇవాళ్టితో ముగియనుంది. ఈ రోజు మీరు లింక్ చేయకుంటే రూ. 10 వేల జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది

PAN-Aadhaar Link: గుర్తుందా.. ఇవాళే లాస్ట్ డేట్.. లింక్ చేస్తే రూ. 10 వేలు మిగిలినట్లే..
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 31, 2022 | 8:17 AM

పాన్‌(PAN) ఆధార్(Aadhaar) లింక్ చేయడానికి ఇక సమయం లేదు.. ఇవాళ్టితో ముగియనుంది. ఈ రోజు మీరు లింక్ చేయకుంటే రూ. 10 వేల జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ఆధార్‌తో లింక్‌ చేయడం అనేది గత ఏడాది 30 సెప్టెంబర్‌ వరకు గడువు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దానిని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ గడువులోగా పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేయకుండా పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోలేని వారు ఈ నెలాఖరులోగా ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది. పాన్‌కార్డు ద్వారా ఎవరు ఎటువంటి లావాదేవీలు చేస్తున్నారో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌(Income tax) అధికారుల వద్ద పూర్తి డేటా ఉంటుంది. కొందరు రెండు పాన్‌ కార్డులు తీసుకుని మిస్‌ యూజ్‌ చేస్తుంటారు. ఇలా రెండు పాన్ కార్డులు తీసుకోవ‌డం అనేది చట్టరిత్యా నేరం. ఒకవేళ రెండు పాన్‌ కార్డులు ఉండి అధికారులకు దొరికిపోయినట్లయితే రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది.

పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి

☛ పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

☛ ఆ తర్వాత ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్‌పై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.

☛ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

☛ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.

☛ అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.

SMS ద్వారా లింక్ చేయడం ఎలా..

☛ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి.

☛ ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.

ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం..

☛ ముందుగా ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.

☛ ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న లింక్ బేస్ విభాగంపై క్లిక్ చేయాలి.

☛ ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తోపాటు పేరు ఫిల్ చేయాలి.

☛ ఆ తర్వాత ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది.

☛ మీ ఆధార్ వివరాలకు వ్యతిరేకంగా, ఐటి విభాగం మీ పేరు, పుట్టిన తేదీతోపాటు లింగాన్ని ధృవీకరిస్తుంది. ఆ తరువాత లింక్ చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.