Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పాలు తాగితే శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతుందా..!

Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే భవిష్యత్‌లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ముందుగా గ్రహించి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది.

Health Tips: పాలు తాగితే శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతుందా..!
Milk
Follow us
uppula Raju

|

Updated on: Mar 30, 2022 | 3:35 PM

Health Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే భవిష్యత్‌లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ముందుగా గ్రహించి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే పాలు తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. ఇందులో నిజం ఎంతుంది.. ఎందుకంటే కొలెస్ట్రాల్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పాలు తాగడం మానేస్తారు. దీనివల్ల వారి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు మాత్రమే కాదు. ఇది కొవ్వు, ప్రొటీన్‌లతో ఉన్నటువంటి ఒక రకమైన లిపిడ్. ఇది రక్తంలో ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. హెచ్‌డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రొటీన్ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. మరోవైపు ఎల్‌డిఎల్ సిరల్లో ఎక్కువగా పేరుకుపోతే గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. మనం మంచి కొలెస్ట్రాల్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిపై ఎటువంటి ప్రభావం ఉండదు. అంతేకాదు చెడు కొలస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయని వివిధ రకాల పరిశోధనలలో తేలింది. నిత్యం పాలు తాగేవారిలో గుండె జబ్బుల ప్రమాదం14 శాతం తగ్గుతుందని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. పరిమిత పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనంలో స్పష్టమైంది.

పాల వల్ల లాభాలు

రోజులో పావు లీటరు పాలు తాగితే అందులో 8 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఒక్క ఈ కొవ్వు గురించి ఆలోచించి పాలు తాగడం మానేయద్దు. శరీరానికి రోజువారీ అవసరాలకి కావాల్సిన ఇతర పోషకాలు పాలలో పుష్కలంగా లభిస్తాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. దీనివల్ల వయసు ముదిరాక బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. పాల ద్వారా విటమిన్ ఎ, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం, జింక్, అయోడిన్ వంటివి లభిస్తాయి.

Health Tips: గర్భిణులు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతారు.. కారణం ఏంటంటే..?

Health Tips: పెళ్లయిన మగవారు కచ్చితంగా ఈ 3 ఆహారాలు తినాలి.. అప్పుడే పూర్తి ఫిట్‌గా ఉంటారు..!

Ostrich Facts: ప్రపంచంలో వేగంగా పరుగెత్తగల పక్షి.. దీని గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!