Health Tips: గర్భిణులు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతారు.. కారణం ఏంటంటే..?

Health Tips: గర్భవతిగా ఉన్నప్పుడు మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హర్మోన్ల అసమతుల్యత వల్ల శారీరక, మానసిక సమస్యలకి గురవుతారు. ఎక్కువగా వాంతులు,

Health Tips: గర్భిణులు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతారు.. కారణం ఏంటంటే..?
Pregnant Women
Follow us
uppula Raju

|

Updated on: Mar 30, 2022 | 3:00 PM

Health Tips: గర్భవతిగా ఉన్నప్పుడు మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హర్మోన్ల అసమతుల్యత వల్ల శారీరక, మానసిక సమస్యలకి గురవుతారు. ఎక్కువగా వాంతులు, వికారం, గ్యాస్, ఒత్తిడికి లోనవుతారు. ఒక మహిళ గర్భిణీగా ఉన్న సమయంలో వివిధ త్రైమాసికాల్లో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్నిసార్లు శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పిని అనుభవిస్తారు. ప్రతి గర్భిణీ ఇలాంటి సమస్యలని ఎదుర్కోవాలని లేదు. కానీ చాలా మందిలో ఇది జరుగుతుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ఎక్కువ మంది తలనొప్పితో బాధపడుతారు. ఇది హార్మోన్ల మార్పులతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే శరీరంలో గ్యాస్ ఏర్పడటం, విపరీతమైన వాంతులు, శరీరంలో కావలసినంత నీరు లేకపోవడం, ఎక్కువ వేడిని అనుభవించడం వల్ల తలనొప్పికి గురవుతారు. గర్భధారణ సమయంలో చాలా సార్లు కడుపు నొప్పితో బాధపడుతారు. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు గ్యాస్ సమస్య వల్ల ఈ నొప్పి రావచ్చు. ఇలా జరిగితే కచ్చితంగా నిపుణుడిని సంప్రదించాలి.

కొంతమంది స్త్రీలు రొమ్ములో నొప్పిని అనుభవిస్తారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా జరుగుతుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు వెన్నునొప్పి ఉంటుంది. ఎందుకంటే పెరిగిన బరువు వల్ల వెన్నుపాముపై ఒత్తిడి పెరుగుతుంది. గర్భధారణ సమయం పెరిగేకొద్దీ నడుము నుంచి కాళ్ళలో నొప్పి, వాపు సమస్యలు ఉంటాయి. అధిక బరువు ఉన్న స్త్రీలు ఈ సమస్యలకి ఎక్కువగా గురవుతారు. ఎండాకాలంలో సూర్యకిరణాలు నేరుగా పడకుండా జాగ్రత్త వహించాలి. ఉష్ణోగ్రతల అధికంగా ఉన్న సమయాల్లో తలనొప్పి, పాదాల వాపు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యస్తమయానికి తరువాత మాత్రమే కొద్ది సేపు నడవటం మంచిది. కేవలం మంచానికే పరిమితం కాకుండా వైద్యులు సూచించిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Health Tips: పెళ్లయిన మగవారు కచ్చితంగా ఈ 3 ఆహారాలు తినాలి.. అప్పుడే పూర్తి ఫిట్‌గా ఉంటారు..!

Ostrich Facts: ప్రపంచంలో వేగంగా పరుగెత్తగల పక్షి.. దీని గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Cricket Photos: ఈ విషయంలో బాబర్ అజామ్‌ అందరిని వెనక్కి నెట్టేశాడు..!