Ostrich Facts: ప్రపంచంలో వేగంగా పరుగెత్తగల పక్షి.. దీని గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!
Ostrich Facts: నిప్పుకోడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల పక్షి. ఇది గాలిలో ఎగరలేనప్పటికీ జంప్ చేయడం ద్వారా 3 నుంచి 5 మీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు.
Updated on: Mar 30, 2022 | 12:34 PM

నిప్పుకోడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల పక్షి. ఇది గాలిలో ఎగరలేనప్పటికీ జంప్ చేయడం ద్వారా 3 నుంచి 5 మీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఇది ఎంతో వేగంగా నడుస్తుంది. సగటున గంటలో 75 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు.

బ్రిటన్ నివేదిక ప్రకారం.. నిప్పుకోడి ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డుని పెడుతుంది. దీని గుడ్డు 6 అంగుళాల పొడవు, 5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది. దీనిని పట్టుకోవడానికి రెండు చేతులు అవసరం.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం.. నిప్పుకోడి అత్యంత ఎత్తైన, బరువైన పక్షి. మగ నిప్పుకోడి పొడవు 9 అడుగుల వరకు ఉంటుంది. ఆడ నిప్పుకోడి 6 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు 100 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. ఇది మొక్కలు, కీటకాలు, చిన్న జీవులను మాత్రమే తింటుంది.

నిప్పుకోడి ఎగరకపోవచ్చు కానీ దిశను మార్చుకోవడానికి రెక్కలను ఉపయోగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పక్షుల పాదాలకు సాధారణంగా మూడు లేదా నాలుగు వేళ్లు ఉంటాయి. కానీ నిప్పుకోడికి 2 మాత్రమే ఉంటాయి. భూమిపై ఉన్న అన్ని జంతువులలో నిప్పుకోడికి పెద్ద కళ్ళు ఉంటాయి.

నిప్పుకోడి ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆత్మరక్షణ విషయానికి వస్తే అది దాని కాళ్ళను ఉపయోగిస్తుంది. దీని పొడవాటి కాళ్ళు చాలా శక్తివంతమైనవి. ఒక్క దెబ్బలో మనిషిని చంపగలదు.





























