- Telugu News Photo Gallery Business photos Samsung Galaxy A series event in India, may launch Galaxy A73 and Galaxy A33 5G smartphones
Samsung Galaxy: సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్స్.. ధర వివరాలు
Samsung Galaxy: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌న్లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి..
Updated on: Mar 30, 2022 | 1:37 PM

Samsung Galaxy: ప్రస్తుతం మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్‌న్లు అందుబాటులోకి వస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇక సామ్‌సంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒకేసారి ఐదు రకాల మోడళ్ళను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఇందులో 5జీ ఫోన్లు కాగా, మరికొన్ని 4జీ ఫోన్లు. రూ.15 వేల ప్రారంభ ధరతో లభించనున్నాయి. 108 మెగాపిక్సెల్ ఫ్యాగ్‌షిప్ కెమెరా కలిగిన ఏ73 5జీ ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. 6జీబీ+128 జీబీ, 8జీబీ+256జీబీ రకాల్లో లభించనున్నాయి.

గెలాక్సీ ఏ53 5జీ మొబైల్ ధర రూ.34,499(6జీబీ+128జీబీ), రూ.35,999(8జీబీ+128జీబీ), గెలాక్సీ ఏ23 ధర రూ.19,499(6జీబీ+128జీబీ), రూ.20,999(8జీబీ+128జీబీ),గెలాక్సీ ఏ13 ధర రూ.14,999(4జీబీ+6జీబీ), రూ.15,999(4జీబీ+128జీబీ), రూ.17,499(6జీబీ+64జీబీ) కానీ, త్వరలో అందుబాటులోకి రానున్న ఏ53 5జీ, ఏ33 5జీ, ఏ23, ఏ13 ధరలను కంపెనీ వెల్లడించలేదు.





























