TruJet: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ట్రూజెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం..!
TruJet: హైదరాబాద్‌కు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అర్థిక ఇబ్బందుల్లో ..
Updated on: Mar 29, 2022 | 2:11 PM

TruJet: హైదరాబాద్‌కు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్ మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ట్రూజెట్ విమాన సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న ఇన్వెస్టర్‌తో చర్చలు చివరి దశకు వచ్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ ఇన్వెస్టర్ 2.5 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా 2022 ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చే విధంగా కొత్త సీఎఫ్‌ఓను నియమించారు. అలానే కంపెనీలో మదుపు చేయడానికి ముందుకు వచ్చిన ఇన్వెస్టర్ కొత్త సీఈఓను ఖరారు చేసే ప్రక్రియ చివరి దశకు వచ్చినట్లు చెబుతున్నారు.

నష్టాల్లో కూరుకుపోయిన ట్రూజెట్ యాజమాన్య హక్కులను బయటకు వెల్లడించని మొత్తానికి తిరిగి ట్రూజెట్ పాత ప్రమోటర్ వీ ఉమేశ్‌కు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) విక్రయించింది.





























