Night Temperatures: మగాళ్లకు హెచ్చరిక.. పెరిగే ఉష్ణోగ్రతలతో ప్రాణాలకే ప్రమాదం.. షాకిస్తున్న కొత్త స్టడీ..!

సాధారణ వేడి కంటే కేవలం 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదాలు దాదాపు 4 శాతం పెరుగుతున్నట్లు BMJ ఓపెన్‌ పరిశోధనలో తేలింది. అయితే, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మరణించే ప్రమాదం పురుషులలో..

Night Temperatures: మగాళ్లకు హెచ్చరిక.. పెరిగే ఉష్ణోగ్రతలతో ప్రాణాలకే ప్రమాదం.. షాకిస్తున్న కొత్త స్టడీ..!
Summer Tips
Follow us
Venkata Chari

|

Updated on: Mar 30, 2022 | 6:48 PM

సాధారణ వేడి కంటే కేవలం 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదాలు దాదాపు 4 శాతం పెరుగుతున్నట్లు కొత్త పరిశోధనలో తేలింది. వేసవి(Summer)లో రాత్రి ఉష్ణోగ్రతలు(Night Temperature) పెరగడం వల్ల పురుషులు మరణించే అవకాశం పెరుగుతుందని ఈ స్టడీ పేర్కొంది. ఈ స్టడీ ప్రకారం, సాధారణ వేడి కంటే కేవలం 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలతో గుండె(Heart) సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదాన్ని దాదాపు 4 శాతం పెంచుతుందని తేలింది. BMJ ఓపెన్‌లో ప్రచురించబడిన ఈ కొత్త పరిశోధన ప్రకారం, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మరణించే ప్రమాదం పురుషులలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుందంట. అయితే, దీని ప్రభావం మహిళలపై ఉండదని ఈ స్టడీ పేర్కొంది.

గత అధ్యయనాలలో, వేడి వాతావరణం కారణంగా, మరణాలు, గుండె జబ్బుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. కానీ, ఈ విషయంలో నిర్దిష్ట వయస్సు గల వ్యక్తుల ప్రస్తావన లేదు. టొరంటో విశ్వవిద్యాలయం నుంచి ఒక బృందం 60-69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల మరణాలను పరిశీలించింది. ఈ స్టడీ కోసం, పరిశోధకులు 2001, 2015 మధ్య జూన్-జూలైలో గుండె జబ్బుల మరణాలపై ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ నుంచి డేటాను సేకరించారు. పరిశోధన కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వంటి దేశాలను ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ నెలల్లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేడి అత్యంత ఎక్కువగా ఉంటుంది. దాదాపు అదే వాతావరణం ఉన్న వాషింగ్టన్‌లోని కింగ్ కౌంటీ నుంచి కూడా ఇలాంటి డేటాను సేకరించారు.

2001 నుంచి 2015 మధ్య చేసిన పరిశోధనలో ఫలితాలను చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో మొత్తం 39,912 మంది గుండె జబ్బులతో మరణించారని, కింగ్ కౌంటీలో 488 మంది మరణించారని తేలింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌లో ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల ఫలితంగా 60-64 సంవత్సరాల వయస్సు గల పురుషులలో గుండె జబ్బుల నుంచి మరణించే ప్రమాదం 3.1 శాతం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. వృద్ధులు, మహిళలు ఈ వర్గంలో చేర్చలేదు.

అదే సమయంలో, కింగ్ కౌంటీలో ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల ఫలితంగా 65 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులలో గుండె జబ్బుల వల్ల 4.8 శాతం మంది మరణించే ప్రమాదం ఉందంట. దీంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ వంటి దేశాల గురించి పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటీవల ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలలో పెరుగుదల కనిపించిదని వారు తెలిపారు. ఈ డేటాను బట్టి, మధ్య-అక్షాంశాల నుంచి అధిక-అక్షాంశ ప్రాంతాలలో నివసించే దేశాల ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నారని పరిశోధకులు అంటున్నారు.

ఈ లక్షణాలపై నిఘా ఉంచండి..

గుండె జబ్బులు గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి సంఘటనలకు దారితీయవచ్చు. రాత్రిపూట చెమటలు పట్టడం, ఛాతీ బిగుతుగా ఉండటం లేదా విశ్రాంతి తీసుకోకపోవడం వంటి లక్షణాలు గుండెపోటుకు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ఒక నివేదిక ప్రకారం, ఇంగ్లాండ్‌లో ప్రతి సంవత్సరం, సుమారు 80,000 మంది గుండెపోటుకు సంబంధించిన కేసుల కారణంగా ఆసుపత్రికి వెళుతున్నారు. కాబట్టి దాని లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

భారత్‌లోనూ పెరుగుతోన్న కేసులు..

అమెరికా దేశంలోని ఓ స్డడీ పేపర్‌లో ప్రచురించిన లెక్కలు చూస్తే భారతీయులు కూడా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2015 నాటికి సుమారు 6.2 కోట్ల మంది హార్ట్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నట్లు తేలింది. ఇక ఈ లిస్టులో దాదాపు 2.3 కోట్ల మంది 40 ఏళ్ల వయసు లోపే వారు కావడం మరింత షాక్ కలిగిస్తోంది. ఒకప్పుడు హార్ట్ సమస్యలు పెద్ద వారికి మాత్రమే వచ్చేవి. కానీ, నేడు పరిస్థితి మారింది. చిన్నవారిలోనూ గుండె సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి.

Also Read: Health Tips: పాలు తాగితే శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరుగుతుందా..!

Health Tips: గర్భిణులు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతారు.. కారణం ఏంటంటే..?