AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: సూపర్ సేవర్ కార్డు.. రూ.59తో రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు

హైదరాబాద్ మెట్రో సేవలు వినియోగించుకునేవారికి సూపర్ న్యూస్ ఇది. సూపర్ సేవర్ కార్డు అందుబాటులోకి వచ్చింది. మెట్రో ప్రకటించిన సెలవు రోజుల్లో ఈ కార్డు ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఖరీదు కూడా చాలా తక్కువ.

Hyderabad Metro: సూపర్ సేవర్ కార్డు.. రూ.59తో రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు
Hyderabad Metro
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2022 | 5:05 PM

Share

హైదరాబాద్ మెట్రో.. ప్రయాణీకుల కోసం సరికొత్త ఆఫర్ తీసుకువచ్చింది.  సూపర్ సేవర్ కార్డు(Super Saver Card)ను ఎల్ అండ్ టీ ఎండీ కె.వి.బి.రెడ్డి ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చని ఆయన చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని స్పష్టం చేశారు. ఉగాది(Ugadi) నుంచి మెట్రోలో సూపర్‌ సేవర్‌ కార్డులు విక్రయించనున్నట్లు ఎండీ ప్రకటించారు. ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారంతో పాటు ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగష్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్‌డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగ రోజుల్లో సూపర్​ సేవర్ కార్డుతో ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. కరోనా(Coronavirus) తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకుంటున్నాయన్నారు. కరోనా టైమ్ లో ప్రయాణికుల భద్రతకు ప్రయారిటీ ఇచ్చినట్లు కె.వి.బి.రెడ్డి చెప్పారు. కరోనాకు ముందు రోజుకి 4 లక్షల కమ్యూటర్స్ ఉన్నారని.. ఇప్పుడు అందులో  70 శాతం అంటే 2.8 లక్షల మంది ప్రయాణీకులు సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రోజుకు 5 నుంచి 6 లక్షల ప్రయాణీకులే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు మెట్రో పాసింజర్స్‌ను లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసి సువర్ణ ఆఫర్ విజేతలుగా ప్రకటించి.. బహుమతులు అందజేశారు.

Also Read: Viral: కన్నంలో ఉన్న పామును బయటకు లాగి కరకరా నమిలి తిన్న మరో పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Follow Us
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?