AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramadan 2022: మరో మూడు రోజుల్లో రంజాన్ మాసం.. హైదరాబాద్ లో సెహరీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..

Ramzan Eid 2022: మరో మూడు రోజుల్లో పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభంకానుంది. ఇస్లామిక్‌ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 3 లేదా 4 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.

Ramadan 2022: మరో మూడు రోజుల్లో రంజాన్ మాసం.. హైదరాబాద్ లో సెహరీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..
Ramadan 2022
Basha Shek
|

Updated on: Mar 31, 2022 | 4:21 PM

Share

Ramzan Eid 2022: మరో మూడు రోజుల్లో పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభంకానుంది. ఇస్లామిక్‌ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 3 లేదా 4 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముస్లింలు రోజా ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. కాగా ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించింది. దీనికి ప్రతీగానే ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలను పాటిస్తారు. నెలపాటు సూర్యోదయానికి ముందే ఉపవాస దీక్షను ప్రారంభించి రోజంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. అలా 2022లో రంజాన్‌ ఏప్రిల్‌ 3 లేదా 4న ప్రారంభమై మే2న ముగుస్తుంది. రంజాన్ చివరి రోజును ఈద్-ఉల్-ఫితర్గా పిలుస్తారు. ఈరోజును ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.

కాగా ఉపవాస దీక్షల్లో భాగంగా సూర్యోదయానికి ముందు తీసుకునే ఆహారాన్ని సెహరీ అని.. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్‌ అని పిలుస్తారు. కాగా సెహరీ, ఇఫ్తార్‌ టైమింగ్స్‌ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. మరి మన హైదరాబాద్‌ నగరంలో వీటి టైమింగ్స్‌ ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్  రంజాన్  టైమ్ టేబుల్

తేదీ సెహరీ ఇఫ్తార్‌
ఏప్రిల్‌ 03 04:58 18:45
4  04:57 18:45
5 04:56 18:46
6 04:55 18:46
7 04:54 18:46
8 04:52 18:47
9 04:51 18:47
10 04:50 18:48
11 04:49 18:48
12 04:48 18:49
13 04:47 18:49
14 04:46 18:50
15 04:45 18:50
16 04:43 18:51
17 04:42 18:51
18 04:41 18:52
19 04:40 18:52
20 04:39 18:52
21 04:38 18:53
22 04:37 18:53
23 04:36 18:54
24 04:35 18:54
25 04:34 18:55
26 04:33 18:55
27 04:32 18:56
28 04:31 18:56
29 04:30 18:57
30 04:29 18:57
మే 1 04:28 18:58
మే 2 04:27 18:58

Also Read:

Vijay Devarakonda: బుద్ధిమంతుడిలా మారిన రౌడీ బాయ్‌.. వైరల్‌ అవుతోన్న విజయ్‌ లేటెస్ట్‌ ఫోటోలు..

Astrology: ఏప్రిల్‌లో పుట్టిన వ్యక్తులకి ప్రత్యేక లక్షణాలు.. ఈ విషయాలలో భిన్నమైన గుర్తింపు..!

Puneeth Rajkumar: స్మార్ట్‌ స్ర్కీన్‌లోకి పునీత్ చివరి సినిమా జేమ్స్‌.. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..