AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: స్మార్ట్‌ స్ర్కీన్‌లోకి పునీత్ చివరి సినిమా జేమ్స్‌.. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

Puneeth Rajkumar: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ (James). చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పునీత్‌ పుట్టినరోజు (మార్చి 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Puneeth Rajkumar: స్మార్ట్‌ స్ర్కీన్‌లోకి పునీత్ చివరి సినిమా జేమ్స్‌.. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..
Puneeth Rajkumar James
Basha Shek
|

Updated on: Mar 31, 2022 | 3:25 PM

Share

Puneeth Rajkumar: కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ (James). చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పునీత్‌ పుట్టినరోజు (మార్చి 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, మలయాళం, తమిళ్‌ భాషల్లో సుమారు 4వేలకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదలైంది. కాగా అప్పూను చివరిసారిగా స్ర్కీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్‌ థియేటర్లకు ఎగబడ్డారు. మొదటి షో నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా తెరపై పునీత్‌ను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగానికి లోనై బరువెక్కిన హృదయాలతో థియేటర్ల నుంచి బయటకు వచ్చారు. ఇక పునీత్‌కు నివాళిగా మార్చి 25వరకు కర్ణాటక అన్ని థియేటర్లలో కేవలం జేమ్స్‌ మూవీ మాత్రమే ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే డిజిటల్‌ స్ర్కీనింగ్‌కు కూడా సిద్ధమైంది జేమ్స్‌. ఈ సినిమా ఓటీటీ విడుదల తేది ఖరారైంది. ఏప్రిల్‌ 14 నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. కాగా ఈ సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌గైక్వాడ్‌ పాత్రలో శ్రీకాంత్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. అదేవిధంగా అను ప్రభాకర్‌, రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించారు.

Also Read:AP: చైన్ స్నాచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. అతడెవరో తెలిసి నిర్ఘాంతపోయిన పోలీసులు

Elephants: తిరుమలలో మళ్లీ ఏనుగుల కలకలం.. గజరాజుల దాడిలో రైతు మృతి

‘నేనొక హిందీ హీరోని తెలుగు సినిమాలు చేయను’.. వివాదాస్పదం అవుతున్న బాలీవుడ్ నటుడి మాటలు..!