Elephants: తిరుమలలో మళ్లీ ఏనుగుల కలకలం.. గజరాజుల దాడిలో రైతు మృతి
తిరుమలలో మళ్లీ ఏనుగుల (Elephants) గుంపు కలకలం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం(Papavinashanam) రోడ్డులో సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు..
తిరుమలలో మళ్లీ ఏనుగుల (Elephants) గుంపు కలకలం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం(Papavinashanam) రోడ్డులో సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు.. వాహనదారులను వెంబడించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగులను అడవిలోకి తిరిగి పంపించేందుకు టీటీడీ(TTD) సిబ్బంది చర్యలు చేపట్టారు. ఏనుగులు తిరుమల వైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. గత ఫిబ్రవరిలోనూ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించింది. ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల మంద రోడ్డు దాటింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఆ గుంపును ఫారెస్ట్‌లోకి మళ్లించారు.
మరోవైపు ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందాడు. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని జోగివారిపల్లె అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. రైతు ఎల్లప్ప తోట వద్ద నిద్రిస్తుండగా అతనిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఎల్లప్ప తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read
Imran Khan: పాక్‌లో అనూహ్యంగా మారుతున్న పరిణామాలు.. ఇమ్రాన్‌కు మొదలైన గడ్డుకాలం..