AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Castrol Super Mechanic Contest: తుది అంకానికి చేరుకున్న క్యాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌.. గ్రాండ్‌ఫినాలేకు 50 మంది ..

Super Mechanic Contest: క్యాస్ట్రోల్ ఇండియా, టీవీ9 నెట్ వర్క్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న సూపర్ మెకానిక్ కాంటెస్ట్ తుది అంకానికి చేరుకుంది. మొత్తం 50 మంది మెకానిక్ లు ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించారు.

Castrol Super Mechanic Contest: తుది అంకానికి చేరుకున్న క్యాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌.. గ్రాండ్‌ఫినాలేకు 50 మంది ..
Super Mechanic Contest
Basha Shek
|

Updated on: Mar 31, 2022 | 3:00 PM

Share

Super Mechanic Contest: సమాజంలో మంచి టాలెంట్‌ ఉన్నవారు ఎందరో ఉన్నారు. మంచి టాలెంట్‌ ఉండి కూడా తమ ప్రతిభను బయట పెట్టలేకపోతున్నారు చాలా మంది. మన శరీరంలో ఏదైనా ఆనారోగ్యం సంభవిస్తే దానిని బాగు చేసేందుకు వైద్యులు ఎంత అవసరమో.. మన వాహనంలో కూడా ఏదైనా సమస్య ఉంటే దానిని పరిష్కరించేందుకు మెకానిక్‌ కూడా అంతే అవసరం. ఎంతో మంది ప్రతిభగల మెకానిక్‌లు ఉన్నారు. కానీ వారికి సరైన వేదిక లేక తమ ట్యాలెంట్‌ను బయటపెట్టలేకపోతున్నారు. అలాంటి వారికి టీవీ9 నెట్‌వర్క్‌, క్యాస్ట్రోల్‌ సంయుక్త ఆధ్వర్యంలో సూపర్‌ మెకానిక్‌గా మారడానికి మంచి అవకాశం కల్పిస్తోంది.  అదే సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌. ఏటా నిర్వహించే ఈ పోటీల ద్వారా మెకానిక్‌ రంగంలో ఉన్న వారు తమ తమ నైపుణ్యాలను ఈ వేదిక ద్వారా బయటపెట్టుకోవచ్చు. మెకానిక్‌ రంగంలో నైపుణ్యాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ను కండక్ట్‌ చేస్తున్నారు. అలా గతేడాది అక్టోబర్‌లో టీవీ9 నెట్‌ వర్క్‌ సహాయంతో సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌ నాలుగో ఎడిషన్‌ ప్రారంభమైంది. #SeekhengeJeetengeBadhenge థీమ్‌తో లక్షమంది ఈ కాంటెస్ట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఊహించినదానికంటే ఈ ప్రోగ్రామ్‌కు స్పందన వచ్చింది. ఏకంగా 1.41లక్షల మంది మెకానిక్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

గ్రాండ్‌ఫినాలేకు 50 మంది..

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (IVR) రౌండ్ ద్వారా పోటీలు నిర్వహించగా పాల్గొన్న వారిలో మొత్తం 35 వేల మంది మెకానిక్‌లు రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. వీరంతా స్కిల్లింగ్ కంటెంట్, లైవ్ మాస్టర్ క్లాస్‌లు, నిపుణులతో ఆన్‌లైన్ సెషన్‌ల ద్వారా శిక్షణ పొందారు. ఆన్‌లైన్ మాస్టర్ క్లాస్‌ల ద్వారా నేరుగా మెకానిక్‌ నిపుణులతో సంభాషించారు. అదేవిధంగా ఆటోమోటివ్ రంగంలో కొత్త సాంకేతికత, నైపుణ్యాలపై అవగాహన పెంచుకున్నారు.  వివిధ రౌండ్లు, సెషన్ల తర్వాత మొత్తం 50 మంది మెకానిక్‌లు ఫైనల్‌ రౌండ్‌ పోటీలకు అర్హత సాధించారు.  వీరంతా సూపర్ మెకానిక్ టైటిల్ కోసం పోటీపడనున్నారు.  కాగా క్యాస్ట్రోల్‌, టీవీ9 నెట్‌వర్క్‌ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. ‘టీవీ9 నెట్‌వర్క్‌, కాస్ట్రోల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ పోటీ వల్లమెకానిక్‌లలో దాగివున్న ప్రతిభను బయటకు తీయవచ్చు. ఈ వేదిక వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని మంత్రి కొనియాడారు. అదేవిధంగా కాస్ట్రోల్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ.. ‘ఇందులో భాగంగా మెకానిక్‌ల ప్రతిభను వెలికి తీసేందుకు వర్చువల్‌ క్లాసులు నిర్వహించాం. భౌతిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆన్‌లైన్‌ క్లాసులు ఏర్పాటుచేశాం. ఇందులో నిష్ణాతులైన నిపుణులతో మెకానిక్‌లు సలహాలు, సూచనలు అందించాం. అదేవిధంగా మెకానిక్‌లు అడిగే ప్రశ్నలకు నిపుణులతో సమాధానాలు ఇప్పించాం. ఈ వేదిక ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం లభించింది.’ అని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఫైనల్‌ పోటీలు..

కాగా కరోనా కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్షల మంది మెకానిక్‌లు డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల వేదికగా తమ నైపుణ్యాలు మెరుగుపర్చకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో, టీవీ ప్రోమోలు, ఎస్టాన్స్, యాంకర్ మాన్షన్‌లు, రేడియో స్పాట్‌లు, అవుట్‌డోర్, డిజిటల్ అడ్వర్టైజింగ్, వాట్సాప్ మెసేజింగ్, IVR లైన్‌లు , టెలి-కాలింగ్ తదితర ఫీచర్ల సహాయంతో ఈ పోటీల్లో పాలు పంచుకున్నారు. ఇక మెకానిక్‌లకకు సులభంగా అర్థమయ్యేలా IVR సేవలను ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ ఇలా మొత్తం తొమ్మిది భాషల్లో అందుబాటులో ఉంచారు. కాగా ఫైనల్‌కు చేరిన 50 మంది మెకానిక్‌లు ఢిల్లీ NCR లో జరిగే గ్రాండ్ ఫినాలే పోటీల్లో టైటిల్ కోసం పోటీపడనున్నారు. కాగా మెకానిక్స్ క్యాస్ట్రోల్ ఇండియా సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌ గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read: KGF 2 Trailer: కేజీఎఫ్‌ రికార్డుల వేట అప్పుడే మొదలైంది.. ట్రైలర్‌కు ఒక్క రోజులో ఎన్ని వ్యూస్‌ వచ్చాయో తెలుసా.?

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..

Maternity Insurance: తల్లిదండ్రులు కావాలనుకుంటే ముందుగా మెట‌ర్నిటీ హెల్త్ పాల‌సీ తీసుకోండి.. ఎన్ని లాభాలో తెలుసా..