Imran Khan: పాక్‌లో అనూహ్యంగా మారుతున్న పరిణామాలు.. ఇమ్రాన్‌కు మొదలైన గడ్డుకాలం..
పాకిస్తాన్‌లో (Pakistan)పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇవన్నీ ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సాగడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే పాకిస్తాన్ తర్వాతి ప్రధానిగా షాబాజ్ షరీఫ్‌కు రంగం సిద్ధమైనట్లు..
పాకిస్తాన్‌లో (Pakistan)పరిణామాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇవన్నీ ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సాగడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే పాకిస్తాన్ తర్వాతి ప్రధానిగా షాబాజ్ షరీఫ్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కి మూడు సార్లు ప్రధానిగా చేశారు షాబాజ్. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని అయ్యాక షాబాజ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. 2019లో మనీ లాండరింగ్ కేసులో షెబాజ్ ఆస్తులు జప్తు చేసింది ప్రభుత్వం, 2020లో అదే కేసుకి సంబంధించి అరెస్టు, ఆతర్వాత బెయిల్ పై బయటకి వచ్చారు షాబాజ్. అప్పటినుంచి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పడదోసేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు.
మరోవైపు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మరో పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సర్కారు మైనార్టీలో పడింది. 12మందికి పైగా సభ్యులున్న మిత్రపక్షం MQM పార్టీకి చెందిన ఏడుగురు ప్రతిపక్ష శిబిరంలో చేరారు. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులతో అత్యవసరంగా భేటీ అయిన ఇమ్రాన్.. ఐఎస్‌ఐ చీఫ్, ఆర్మీ చీఫ్‌లతోనూ మాట్లాడారు.
ఓవైపు ఇమ్రాన్‌ఖాన్ వరుస భేటీలు అవుతుండడం.. ఐఎస్‌ఐ, ఆర్మీని దగ్గర చేసుకుంటుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫే తర్వాతి ప్రధాని అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో ప్రకటించారు. తమకు ప్రజాబలంతోపాటు.. సభ్యుల బలం కూడా ఉందంటున్నారు బిలావల్ భుట్టో.
పాకిస్తాన్‌లో జనరల్ అసెంబ్లీలో మొత్తం 343మంది సభ్యులుండగా.. సాధారణ మెజార్టీ 172గా ఉంది. మిత్రపక్షాలతో కలిపి ఇమ్రాన్ బలం 176గా ఉండేది. ఏడుగురు MQM సభ్యులు వైదొలగడంతో 163కి పడిపోయింది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నుంచి 12మంది ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకెక్కారు ఏప్రిల్‌లో జరిగే బలపరీక్షలో తమ పార్టీ నుంచి జంప్ అయిన నేతలు ఓటింగ్‌లో పాల్గొనకుండా చేయాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల బలం 100 నుంచి అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడు ఇమ్రాన్‌ని పడదోసి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేంత బలం షాబాజ్ షరీఫ్ ముందున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..
Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..