Vijay Devarakonda: బుద్ధిమంతుడిలా మారిన రౌడీ బాయ్.. వైరల్ అవుతోన్న విజయ్ లేటెస్ట్ ఫోటోలు..
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. చేసినవి కొన్ని సినిమాలే అయిన ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తొలి సినిమా 'పెళ్లి చూపులు'లో (pelli choopulu) ఇన్నోసెంట్ లుక్‌లో కనిపించిన...
Vijay Devarakonda: అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. చేసినవి కొన్ని సినిమాలే అయిన ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తొలి సినిమా ‘పెళ్లి చూపులు’లో (pelli choopulu) ఇన్నోసెంట్ లుక్‌లో కనిపించిన విజయ్, అర్జున్ రెడ్డితో డిఫ్రెంట్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. యూత్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ లైగర్ సినిమా కారణంగా ఇటీవల ఎక్కువగా లాంగ్ హెయిర్‌తో కనిపిస్తూ వచ్చాడు.
సోషల్ మీడియాతో పాటు, సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇలాంటి గెటప్స్‌లోనే కనిపించాడు. అయితే తాజాగా లైగర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న విజయ్, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘జనగణమన’కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా కనిపించిన ఫోటోల్లో విజయ్ పూర్తిగా మరోసారి ఇన్నోసెంట్‌గా మారిపోయాడు. లాంగ్ హెయిర్‌ను కాస్త ట్రిమ్ చేసి పర్‌ఫెక్ట్ జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. జనగణమనలో సైనికుడి పాత్రలో నటిస్తున్న కారణంగా విజయ్ తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.
View this post on Instagram
ఇదిలా ఉంటే తాజాగా విజయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. ఫార్మల్ సూట్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు విజయ్. ఈ ఫోటోలను పోస్తూ ‘బాయ్’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించాడు విజయ్. దీంతో మొన్నటి వరకు రగ్‌డ్ లుక్‌లో కనిపించిన విజయ్ ఇలా క్లాస్ లుక్‌లోకి మారిపోయే సరికి ఆయన లేడీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం లాంగ్ హెయిరే బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
Also Read: Minister Botsa: ప్రభుత్వం చేసే ప్రతి పైసా అప్పుకూ లెక్కలున్నాయి.. మంత్రి బొత్స కీలక ప్రకటన
ప్రేమ పక్షులు శృతి, శంతనుల ఫోటోలు వైరల్
New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్ ఇవే..!