AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్‌ ఇవే..!

New Cars: మార్చి నెల ముగియబోతోంది శుక్రవారం నుంచి ఏప్రిల్‌ నెల ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్‌లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి. ఇందులో మెర్సిడెస్ EQS ,

New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్‌ ఇవే..!
New Cars
uppula Raju
|

Updated on: Mar 31, 2022 | 11:32 AM

Share

New Cars: మార్చి నెల ముగియబోతోంది శుక్రవారం నుంచి ఏప్రిల్‌ నెల ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్‌లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి. ఇందులో మెర్సిడెస్ EQS , కొత్త టాటా నెక్సాన్ EV , మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ కార్ల గురించి ఒక్కసారి తెలుసుకుంటే మంచిది. ఇందులో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచుతామని అన్ని కార్ల కంపెనీలు ప్రకటించాయి. స్టీల్, అల్యూమినియం తదితర ఉత్పత్తుల ధరల పెరుగుదల వల్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మెర్సిడెస్‌తో పాటు టయోటా కిర్లోస్కర్ మోటార్, బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, టాటా మోటార్స్ కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను 2 నుంచి 2.5 శాతం పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.

1. కొత్త మారుతీ ఎర్టిగా: మారుతీ ఎర్టిగా ఏప్రిల్ నెలలో నాక్ చేయవచ్చు. ఈ MPV కారు అనేక మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో రానుంది. CNG వేరియంట్ కారణంగా ఎర్టిగాకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుత వేరియంట్‌లో మాత్రం 1.5 లీటర్ ఇంజన్ ఉంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

2. కొత్త టాటా నెక్సాన్ EV: టాటా మోటార్స్ కొత్త కారును తీసుకురాబోతోంది. అది కొత్త టాటా నెక్సాన్ కావొచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ కారు ఏప్రిల్ 6 న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీల వరకు ప్రయాణించగలదు. అలాగే ఈ కారులో అనేక మంచి ఫీచర్లు, కొత్త బంపర్‌లను చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొత్తగా ఉంటుంది.

3. మెర్సిడెస్ EQS EV: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తన కొత్త ఎలక్ట్రిక్ కారు Mercedes EQS EVని ఏప్రిల్‌లో పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ కారును ఏప్రిల్ 19న విడుదల చేయనుంది.

4. కొత్త మారుతి XL 6: మారుతి XL 6ని కొత్త వేరియంట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే లాంచ్ సమాచారం కంపెనీ ప్రకటించలేదు. ఈ కారు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, బంపర్, అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది. అలాగే ఇంటీరియర్ కూడా కొత్తగా ఉంటుంది.

The Kashmir Files: 300 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’.. ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు..!

ECLGS: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ 5 లక్షల కోట్లకు పెంపు..!

Vastu Tips: పెళ్లయిన మహిళలు ఆ దిక్కున అస్సలు పడుకోకూడదు..!

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!