AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs CSK, IPL 2022: ఆ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో చెన్నై బౌలర్‌.. మిస్టర్‌ కూల్‌ను ఊరిస్తోన్న మరో రికార్డు.. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్‌..

CSK vs LSG: డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఐపీఎల్‌ 2022 (IPL 2022)లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) చేతిలో పరాజయం పాలైంది.

LSG vs CSK, IPL 2022: ఆ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో చెన్నై బౌలర్‌.. మిస్టర్‌ కూల్‌ను ఊరిస్తోన్న మరో రికార్డు.. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్‌..
Csk Vs Lsg
Basha Shek
|

Updated on: Mar 31, 2022 | 6:49 PM

Share

CSK vs LSG: డిపెండింగ్‌ ఛాంపియన్‌గా ఐపీఎల్‌ 2022 (IPL 2022)లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) చేతిలో పరాజయం పాలైంది. కాగా నేడు (మార్చి31) ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. రాహుల్‌ సారథ్యంలోని లక్నో కూడా మొదటి మ్యాచ్‌లో ఓటమిపాలు కావడంతో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. దీంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌ ద్వారా ఒక అరుదైన రికార్డు అందుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు సీఎస్కే వెటరన్‌ బౌలర్‌ డ్వేన్‌ బ్రావో (Dwayne Bravo). లక్నోతో జరిగే మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీస్తే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఇప్పటివరకు ఈ రికార్డు లంక స్పీడ్‌స్టర్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ పేరుపై ఉంది. అతను ఐపీఎల్‌లో మొత్తం 170 వికెట్లు పడగొట్టాడు. ఇక కేకేఆర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన డ్వేన్‌ బ్రావో 170 వికెట్లతో మలింగతో కలిసి సమానంగా ఐపీఎల్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.

మరో 15 పరుగులు చేస్తే..

దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో అతను ఐపీఎల్‌ మలింగను అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా ఐపీఎల్‌ టాప్‌ వికెట్‌ టేకర్స్‌ జాబితాలో మలింగ, బ్రావోల తరువాత అమిత్‌ మిశ్రా (166), పీయుష్‌ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150), రవిచంద్రన్ అశ్విన్ (145) ఉన్నారు. బ్రావో పాటు ధోనికి కూడా ఓ రికార్డు ఊరిస్తుంది. అదేంటంటే.. టీ20 క్రికెట్‌లో మ‌రొక 15 ప‌రుగులు చేస్తే ఈ ఫార్మాట్లో 7 వేల ప‌రుగులు చేసిన ఐదో భార‌త ఆట‌గాడిగా రికార్డు సృష్టిస్తాడు మిస్టర్‌ కూల్‌. కాగా కేకేఆర్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే జట్టు విఫలమైనా సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్‌ ధోని (50 నాటౌట్‌), బ్రావో (20/3) అద్భు్తంగా రాణించారు. దీనికి తోడు మొదటి మ్యాచ్‌కు దూరమైన ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ మొయిన్‌ అలీ జట్టులో చేరనుండం ఆ జట్టుకు మరింత సానుకూలాంశమని చెప్పవచ్చు.

Also Read:Nizamabad Politics: నమ్మి ప‌ద‌విస్తే అధికార పార్టీకే ఎసరు.. ఎమ్మెల్యేలకు పంటికింద రాయిలా మారిన నేత!

Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ‘సర్కారు వారి పాట’లో అదే హైలైట్.?

Alia Bhatt: అందుకే ఆర్ఆర్ఆర్ ఫోటోలు డిలీట్ చేశాను.. అసలు విషయం చెప్పేసిన అలియా..