LSG vs CSK Live Score, IPL 2022: ఉత్కంఠ భరిత పోరులో చెన్నైపై ‘లక్నో’ సూపర్ విక్టరీ.. వీర బాదుడు బాదేశారు..!

| Edited By: Shiva Prajapati

Updated on: Apr 01, 2022 | 12:00 AM

Lucknow Super Giants vs Chennai Super Kings Live Score in Telugu: ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో...

LSG vs CSK Live Score, IPL 2022: ఉత్కంఠ భరిత పోరులో చెన్నైపై ‘లక్నో’ సూపర్ విక్టరీ.. వీర బాదుడు బాదేశారు..!
Lsg Vs Csk

Lucknow Super Giants vs Chennai Super Kings: చెన్నై మరోసారి చతిలికపడిపోయింది. నువ్వా నేనా అంటూ ఉత్కంఠభరితంగా సాగిన హోరాహోరీ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ టీమ్. నిర్ణీత 20 ఓవర్లలో 3 బంతులు మిగిలి ఉండగానే.. 210 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఇక 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో బ్యాట్స్‌మెన్.. తొలి నుంచి దుమ్మురేపే ఫార్ఫార్మెన్స్‌ చూపెట్టారు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ రెచ్చిపోయారు ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్. ఈ ఇద్దరూ కలిసి 99 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు. కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి ఔట్ అవగా.. డికాక్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి రెచ్చిపోయాడు. ఆ తరువాత వరుసగా రెండు వికెట్లు పడి.. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఎవిన్ లేవిస్, ఆయుష్ బదోని.. ఎంటరై దుమ్మురేపారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంను హోరెత్తించారు. 3 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి మ్యాచ్‌ను ముగించారు. లేవిస్ 23 బంతుల్లో 55 పరుగులు( 3 సిక్సర్లు, 6 ఫోర్లు) చేశాడు. బదోని 2 సిక్సర్లతో మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 19 పరుగులు చేశాడు.

ఇక లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది తొలి విజయం కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌కు ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడిన లక్నో ఓటమి పాలవగా.. చెన్నై టీమ్ కోల్‌కతాతో తలపడి ఓటమిపాలైంది. సెకండ్ మ్యాచ్‌ కూడా ఓడిపోవడంతో అభిమానులు నిట్టూరుస్తున్నారు.

లక్నో టీమ్: బ్యాటింగ్: కేఎల్ రాహుల్(40), క్వింటన్ డికాక్(61), మనీష్ పాండే(5), ఎవిన్ లేవిస్(55)*, దీపక్ హుడా(13), ఆయుష్ బదోని(19)*. బౌలింగ్: అవేష్ ఖాన్ 2, ఆండ్రూ టై 2, రవి బిషోని 2.

చెన్నై టీమ్: బ్యాటింగ్: ఊతప్ప 50, రుతురాజ్ గైక్వాడ్ 1, మొయిన్ 35, శివమ్ దూబె 49, రాయుడు 27, రవీంద్ర జడేజా 17, ధోని 16, బ్రావో 1. బౌలింగ్: తుషార్ దేశ్‌పాండె 1, డ్వేన్ బ్రావో 1, ప్రిటోరియస్ 2.

Key Events

ఇరు జట్లకు విజయం కీలకం..

ఐపీఎల్‌ 2021లో లక్నో, చెన్నై జట్లు రెండు ఓటమితోనే టోర్నీని ప్రారంభించారు. దీంతో ఈరోజు ఎలాగైనా మ్యాచ్‌ గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నారు.

టాస్‌ కీలకంగా మారనుంది..

బ్రబౌర్న్‌ స్టేడియంలో రెండో ఇన్నింగ్స్‌పై మంచు కీలక ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాస్‌ మ్యాచ్‌కు కీలకంగా మారనుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 31 Mar 2022 11:20 PM (IST)

    Lucknow vs Chennai, LIVE Score: నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. దీపక్ హుడా ఔట్..

    లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా ఔట్ అయ్యాడు. 8 బంతులాడిన దీపక్.. 13 పరుగులు చేశాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 17 ఓవర్లుకు 171/4. ఈ మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే 16 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది.

  • 31 Mar 2022 11:01 PM (IST)

    Lucknow vs Chennai, LIVE Score: మూడో వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్.. డికాక్ ఔట్..

    లక్నో సూపర్ జెయింట్స్ మూడో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డికాక్ ఔట్ అయ్యాడు. మ్యాచ్ ఆరంభం నుంచి జట్టు స్కోర్ పెంచడంలో అద్భుతంగా రాణినంచిన డికాక్.. ప్రిటోరియస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 45 బంతులాడిన డికాక్.. 61 పరుగులు చేశాడు. ప్రస్తుతం జట్టు స్కోర్ 14 ఓవర్లకు 144/3

  • 31 Mar 2022 10:45 PM (IST)

    మరో వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్.. మనీష్ పాండే ఔట్..

    లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ మరో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన మనీష్ పాండే క్యాచ్ ఔట్ అయ్యాడు. 6 బంతుల్లో 5 పరుగులు చేశాడు.

  • 31 Mar 2022 10:41 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్‌కు బ్రేక్.. కేఎల్ రాహుల్ ఔట్..

    లక్ష్య చేధనలో మాంచి దూకుడుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌కు రాయుడు రూపంలో బ్రేక్ పడింది. కేఎల్ రాహుల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. రాహుల్ 26 బంతుల్లో 40 పరుగులు చేసి ఓపెనర్‌గా అదరగొట్టాడు.

  • 31 Mar 2022 10:39 PM (IST)

    తగ్గేదే లే అంటున్న లక్నో జెయింట్స్.. 10 ఓవర్లకు 100 పరుగులు..

    211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జెయింట్స్ బ్యాట్స్‌మెన్ ఎక్కడా తగ్గడం లేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ దంచి కొడుతున్నారు. 10 ముగిసే సమయానికి 100 పరుగలు చేశారు.

  • 31 Mar 2022 10:14 PM (IST)

    అదరగొడుతున్న లక్నో జెయింట్స్.. 6 ఓవర్లలో 65 పరుగులు..

    లక్నో జెయింట్స్ టీమ్ బ్యాటింగ్‌లో అదరగొడుతుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, డి కాక్.. ఆచితూచి ఆడుతూనే స్కోర్ పెంచుతున్నారు. 6 ఓవర్లకు లక్నో జెయింట్స్ స్కోర్ 66.

  • 31 Mar 2022 10:03 PM (IST)

    మాంచి స్పీడ్‌ మీదున్న ఎల్ఎస్జీ.. 4 ఓవర్లకు 46 పరుగులు..

    211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్.. మాంచి స్వింగ్‌లో ఉంది. నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి 46 పరుగులు చేసింది.

  • 31 Mar 2022 09:53 PM (IST)

    ఆచితూచి ఆడుతోన్న లక్నో..

    చెన్నై ఇచ్చిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన లక్నో ఆచితూచి ఆడుతోంది. మూడు ఓవర్లు మగిసే సమయానికి లక్నో ఒక్క వికెట్ నష్టపోకుండా 24 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (13), క్వింటన్‌ డి కాక్‌ (07) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 31 Mar 2022 09:24 PM (IST)

    ముగిసిన చెన్నై ఇన్నింగ్స్‌..

    టాస్‌ ఓడి బ్యాటింగ్‌ మొదలు పెట్టిన చెన్నై ఇన్నింగ్స్‌ ముగిసింది. మొదటి నుంచి చెన్నై బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడడంతో జట్టు స్కోరు 200 మార్కు దాటేసింది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్‌ చివరల్లో క్రీజులోకి వచ్చిన ధోనీ 6 బంతుల్లో 16 పరుగులు సాధించి. టీ20 క్రికెట్‌లో 7000 పరుగులు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

  • 31 Mar 2022 09:17 PM (IST)

    చివరి క్షణంలో మరో వికెట్‌..

    చెన్నై ఇన్నింగ్స్‌ ముగియడానికి కేవలం 4 బంతులే మిగిలున్న సమయంలో రవీంద్ర జడేజా అవుట్‌ అయ్యాడు. ఆండ్ర టై బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మనీష్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

  • 31 Mar 2022 09:12 PM (IST)

    శివమ్‌ దూబె అవుట్‌..

    చెన్నై మరో వికెట్ కోల్పోయింది. 49 పరుగుల వద్ద శివమ్‌ దూబె ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో లూయిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • 31 Mar 2022 09:00 PM (IST)

    చెన్నైకి మరో ఎదురు దెబ్బ..

    చెన్నై జట్టు స్కోరు దూసుకుపోతున్న సమయంలోనే కీలక వికెట్‌ కోల్పోయింది. 27 పరుగుల వద్ద అంబటి రాయుడు అవుట్‌ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. చెన్నై 17 ఓవర్లు ముగిసే సమయానికి 172 పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 31 Mar 2022 08:26 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై..

    చెన్నై మూడో వికెట్‌ కోల్పోయింది. మొయిన్‌ అలీ రూపంలో మరో వికెట్ పడింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులోకి అంబటి రాయుడు ఎంట్రీ ఇచ్చాడు.

  • 31 Mar 2022 08:13 PM (IST)

    చెన్నై జోరుకు బ్రేక్‌..

    చెన్నై జోరుకు బ్రేక్‌ పడింది. భారీ షాట్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఉతప్ప అవుట్ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజులోకి శివమ్‌ దూబె ఎంట్రీ ఇచ్చాడు.

  • 31 Mar 2022 08:11 PM (IST)

    రాబిన్‌ హాఫ్‌ సెంచరీ..

    రాబిన్‌ ఉతప్ప భారీ షాట్స్‌తో జట్టు స్కోరును పెంచేస్తున్నాడు. కేవలం 26 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రాబిన్‌కు ఇది రెండో హాఫ్‌ సెంచరీ కాగా, ఐపీఎల్‌ కెరీర్‌లో 26వ హాఫ్‌ సెంచరీ.

  • 31 Mar 2022 08:02 PM (IST)

    దూసుకుపోతున్న చెన్నై స్కోర్‌..

    టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు మొదట్లోనే వికెట్‌ కోల్పోయినా తర్వాత వేగంగా పుంజుకుంది. మొయిన్‌ అలీ, ఉతప్ప దంచి కొడుతున్నారు. దీంతో జట్టు స్కోర్‌ వేగంగా పరిగెడుతోంది. 6 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 73 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో ఉతప్ప (45), మొయిన్‌ ఆలీ (21) పరుగుల వద్ద కొనసాగుతున్నారు.

  • 31 Mar 2022 07:56 PM (IST)

    దంచి కొడుతోన్న రాబిన్‌..

    రాబిన్‌ ఉతప్ప దంచి కొడుతున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి పంపిస్తున్నాడు. కేవలం 20 బంతుల్లోనే 44 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ను పెంచేపనిలో పడ్డాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 57/1 పరుగుల వద్ద కొనసాగుతోంది. క్రీజులో మొయిన్‌ అలీ (06), రాబిన్‌ ఉతప్ప (44) పరుగుల వద్ద కొనసాగుతున్నాడు.

  • 31 Mar 2022 07:47 PM (IST)

    తొలి వికెట్‌ గాన్‌..

    చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ రన్‌ అవుట్‌ రూపంలో వెనుతిరిగాడు. చెన్నై ప్రస్తుతం 3 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 28 పరుగుల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో మొయిన్‌ ఆలీ (0), రాబిన్‌ ఉతప్ప (21) పరుగుల వద్ద కొనసాగుతోంది.

  • 31 Mar 2022 07:13 PM (IST)

    ఇరు జట్లు..

    లక్నో సూపర్ జెయింట్స్..

    కేఎల్‌ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, దుశ్మంత చమీరా, ఆండ్రూటై, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌

    చెన్నై సూపర్‌ కింగ్స్‌..

    రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప, మొయిన్‌ ఆలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్‌), శివమ్‌ దూబె, ఎంఎస్‌ ధోని (కీపర్‌), డ్వేన్‌ బ్రావో, డ్వేన్‌ ప్రిటోరియస్‌, ముకేశ్‌ చౌదరి, తుషార్‌ దేశ్‌పాండే.

  • 31 Mar 2022 07:03 PM (IST)

    టాస్‌ గెలిచిన లక్నో..

    రెండు జట్లకు కీలకంగా మారిన మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచింది. టాస్‌ గెలిచిన లక్నో మొదట బౌలింగ్‌ చేయనుంది. పిచ్‌ కారణంగా మొదట బౌలింగ్ ఎంచుకున్నట్లు కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు.

  • 31 Mar 2022 06:57 PM (IST)

    అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..

    చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ సారథి ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 15 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్‌లో ధోనీ 7000 పరుగుల మైలరాయిని అందుకుంటాడు. టీ20 ఫార్మట్‌లో ఇప్పటి వరకు భారత్‌కు చెందిన నలుగురు బ్యాట్స్‌మెన్ 7 వేల పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో 15 పరుగులు చేస్తే.. ధోనీ ఐదో టీమిండియా ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు 7వేల పరుగులు చేసిన తొలి కీపర్‌గా నిలుస్తాడు.

Published On - Mar 31,2022 6:42 PM

Follow us