AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం ఇండియాకు పయనమైన ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌..

Royal Challengers Bangalore: ఐపీఎల్‌ టోర్నీ మొదటి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓటమిపాలైంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు. అయితే నిన్న (మార్చి 30)కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది.

IPL 2022: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం ఇండియాకు పయనమైన ఆ స్టార్‌ ఆల్‌రౌండర్‌..
Rcb
Basha Shek
|

Updated on: Mar 31, 2022 | 5:08 PM

Share

Royal Challengers Bangalore: ఐపీఎల్‌ టోర్నీ మొదటి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓటమిపాలైంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు. అయితే నిన్న (మార్చి 30)కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది. ఇప్పుడు ఆ విజయ పరంపరను అలాగే కొనసాగించాలని చూస్తోంది. తదుపరి మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఆర్సీబీ జట్టుకు ఒక శుభవార్త అందింది. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) త్వరలోనే ఆ జట్టుతో కలవనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్‌ టోర్నీ కోసం ఇండియాకు పయనమైనట్లు ఓ హింట్ ఇచ్చాడు మ్యాక్సీ. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో తన పాస్‌పోర్టు, విమాన టిక్కెట్లకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు. దీంతో వీలైనంత త్వరలోనే ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆర్సీబీతో కలవడం ఖాయమైపోయింది. కాగా ఇండియాకు వచ్చిన వెంటనే అతను కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో గడపాల్సి ఉంది.

కాగా ఇటీవల తన ప్రియురాలితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు మ్యాక్స్‌వెల్‌. భారత సంతతికి చెందిన వినీరామన్‌తో కలిసి మార్చి 18న పెళ్లిపీటలెక్కాడు. ఇటీవల భారతీయ హిందూ సంప్రదాయ ప్రకారం మరోసారి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఇండియన్ ట్రెడిషన్ ఔట్ ఫిట్‌లో ఉన్న మ్యాక్సీ, వినీ రామన్ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పెళ్లి వేడుకల కోసమే ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు మ్యాక్సీ. అయితే వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ ముగియడంతో వెంటనే భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే తన పాస్‌పోర్ట్‌, విమాన ఫొటోలను ఇన్‌స్టాస్టోరీస్‌ లో షేర్‌ చేశాడు. దీంతో బెంగళూరు జట్టుతో పాటు అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా గత సీజన్‌లో అమోఘంగా రాణించిన మ్యాక్సీ 144.1 స్ట్రైక్‌రేటుతో మొత్తం 513 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి.

Glenn Maxwell

Also Read:Bombay High Court: విడాకులు తీసుకున్న భర్తకు భరణం ఇవ్వాల్సిందే.. బొంబాయి హైకోర్టు కీలక తీర్పు

Job Mela: ఆదివారం తెలంగాణలో భారీ జాబ్‌ మేళా.. పాల్గొననున్న 15కిపైగా కంపెనీలు..

Ramadan 2022: మరో మూడు రోజుల్లో రంజాన్ మాసం.. హైదరాబాద్ లో సెహరీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..