Bombay High Court: విడాకులు తీసుకున్న భర్తకు భరణం ఇవ్వాల్సిందే.. బొంబాయి హైకోర్టు కీలక తీర్పు

భార్యాభర్తలు చట్టప్రకారం విడిపోయినప్పుడు భార్యకు భర్త భరణం(alimony) ఇవ్వడం చాలా కాలం నుంచి వస్తున్న పద్ధతి. అయితే ఈ విషయంలో బొంబాయి హైకోర్టు ఔరంగాబాద్​ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ఓ కేసులో భార్యే భర్తకు..

Bombay High Court: విడాకులు తీసుకున్న భర్తకు భరణం ఇవ్వాల్సిందే.. బొంబాయి హైకోర్టు కీలక తీర్పు
Bombay High Court
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 31, 2022 | 4:59 PM

భార్యాభర్తలు చట్టప్రకారం విడిపోయినప్పుడు భార్యకు భర్త భరణం(alimony) ఇవ్వడం చాలా కాలం నుంచి వస్తున్న పద్ధతి. అయితే ఈ విషయంలో బొంబాయి హైకోర్టు ఔరంగాబాద్​ బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ఓ కేసులో భార్యే భర్తకు భరణం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా భరణం అంశంపై మహారాష్ట్రలోని(Maharashtra) నాందేడ్​ సివిల్​కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు సివిల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇచ్చిన పిటిషన్ ను కొట్టివేసింది.1992లో వివాహమైన ఓ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. కుటుంబ కలహాలతో కలిసి ఉండలేమని భావించి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయించారు. భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో భార్య నాందేడ్​సివిల్ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు వారికి అదే ఏడాది విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్​24, 25 ప్రకారం భార్య నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె భర్త పిటిషన్​ వేశారు. తనకు జీవనాధారం ఏమీ లేదని, భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మంచి వేతనం తీసుకుంటున్నట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. ఆమె ఆ స్థానంలో ఉండేందుకు తానెంతో కష్టపడ్డానని తెలిపారు. భర్త పిటిషన్​ను విచారించిన నాందేడ్​ సివిల్​ కోర్టు భరణం ఇవ్వాలని భార్యను ఆదేశించింది.

అయితే భర్తకు భరణం ఇవ్వాలంటూ నాందేడ్​సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఔరంగాబాద్​హైకోర్టును ఆశ్రయించింది భార్య. విడాకులు మంజూరయ్యాక వారి బంధం ముగిసిపోయిందని, ఎలాంటి భరణం, ఖర్చులు ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషనర్​తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్​25 ప్రకారం ఎప్పుడైనా భరణం కోరుతూ పిటిషన్​ వేయవచ్చని భర్త తరఫు న్యాయవాది తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. భర్తకు భార్య భరణం ఇవ్వాలని తీర్పు వెల్లడించింది.

Also Read

Hyderabad Metro: సూపర్ సేవర్ కార్డు.. రూ.59తో రోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు మరో మలుపు.. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

Shriya Saran: ఆర్ఆర్ఆర్‏లో చరణ్, తారక్ ఉన్నారని నాకు తెలీదు.. శ్రియా సరన్ ఆసక్తికర కామెంట్స్..

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!