Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు మరో మలుపు.. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!

తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నిందితులందరికీ మేడ్చల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు మరో మలుపు.. నిందితులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు!
Srinivas Goud
Follow us

|

Updated on: Mar 31, 2022 | 3:34 PM

Srinivas Goud Murder Conspiracy: తెలంగాణ(Telangana) అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నిందితులందరికీ మేడ్చల్ కోర్టు(Medchal Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏ 1 నుంచి ఏ 7 వరకు నిందితులు రూ.20వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మార్చి 28న బెయిల్ పిటీషన్పై వాదనలు పూర్తి కాగా.. మేడ్చల్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషన్ పై విచారణ సందర్భంగా పోలీసులు.. రాష్ట్ర మంత్రినే హత్య చేసేందుకు కుట్ర పన్నిన నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటర్ దాఖలు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వొద్దని, నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు నిందితుల పోలీస్ కస్టడీ ఇప్పటికే ముగిసినందున వారికి బెయిల్ మంజూరు చేయాలని డిఫెన్స్ లాయర్ న్యాయమూర్తిని అభ్యర్థించారు. వారంతా విచారణకు సహకరిస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా నిందితులందరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గత నెల 26న మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ఇచ్చిన సమాచారం మేరకు రెండు రోజుల తర్వాత మిగతా ముగ్గురిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. రాఘవేందర్ రాజు, నాగరాజు, విశ్వనాథరావు, యాదయ్య, రవి, మధుసూదన్ రాజు, అమరేందర్ రాజులను పోలీసుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరగా.. కోర్టు కేవలం 4 రోజులకు మాత్రమే అనుమతించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను సైతం పోలీసులు అరెస్ట్ చేయగా.. వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని విడుదల చేశారు. మిగతా నిందితుల పిటీషన్ పై విచారణ జరిపిన మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read Also… AP: చైన్ స్నాచర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. అతడెవరో తెలిసి నిర్ఘాంతపోయిన పోలీసులు

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..