Inter Exams: ఆ జిల్లాల్లో ఇంటర్ పరీక్ష రద్దు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

యూపీ ప్రభుత్వం(Uttar Pradesh) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన ఇంటర్‌ సెకండ్ ఇయర్ పాలీ ఇంగ్లీష్‌(English Exam) పరీక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ...

Inter Exams: ఆ జిల్లాల్లో ఇంటర్ పరీక్ష రద్దు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Sri Lanka Exams
Follow us

|

Updated on: Mar 31, 2022 | 4:20 PM

యూపీ ప్రభుత్వం(Uttar Pradesh) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన ఇంటర్‌ సెకండ్ ఇయర్ పాలీ ఇంగ్లీష్‌(English Exam) పరీక్షను రద్దు చేస్తున్నట్లు అక్కడి విద్యాశాఖ ప్రకటన చేసింది. ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని బల్లియా జిల్లాలో పేపర్ లీక్ అయిన విషయం బయటకు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ తరగతి ఇంగ్లీష్ పేపర్ రద్దు(Exam Cancelled) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పరీక్ష మళ్లీ ఎప్పుడు ఉండబోతోందన్న వివరాలు వీలైనంత త్వరగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. పేపర్ లీక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో యూపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం పన్నెండో తరగతి ఇంగ్లీష్‌ పేపర్‌ పరీక్షా పత్రం లీక్‌ అయ్యింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు రెండో షిఫ్ట్‌లో ఈ పరీక్ష జరుగాల్సి ఉంది. అయితే బల్లియా జిల్లాలో ఇంగ్లీష్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది. 316 ఈడీ నుంచి 316 ఈఎల్‌ సిరీస్‌ ఇంగ్లీష్‌ పశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను రూ.500కు మార్కెట్‌లో అమ్ముతున్నట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో యూపీ ఇంటర్‌ బోర్డు స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంగ్లీష్‌ పశ్నాపత్రాలు లీక్‌ అయిన ఈ సిరీస్‌కు సంబంధించిన 24 జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం జరుగాల్సిన ఇంగ్లీష్‌ పరీక్షను రద్దు చేసింది.

కాగా, పేపర్‌ లీక్‌ కారణంగా ఆగ్రా, మెయిన్‌పురి, మధుర, అలీఘడ్‌, ఘజియాబాద్, బాగ్‌పత్, బదౌన్, షాజహాన్‌పూర్, ఉన్నావ్, సీతాపూర్, లలిత్‌పూర్, మహోబా, జలౌన్, చిత్రకూట్, అంబేడ్కర్‌నగర్, ప్రతాప్‌గఢ్, గోండా, గోరఖ్‌పూర్, అజంగర్‌పూర్, బల్లియా, వారణాసి, కాన్పూర్ దేహత్, ఎటా, షామ్లీ జిల్లాల్లో బుధవారం జరుగాల్సిన ఇంగ్లీష్‌ పరీక్ష రద్దయ్యింది.

Also Read

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాల అంటూ పాట పాడిన ఈ మల్లి ఎవరో తెలుసా..?

Castrol Super Mechanic Contest: తుది అంకానికి చేరుకున్న క్యాస్ట్రోల్‌ సూపర్‌ మెకానిక్‌ కాంటెస్ట్‌.. గ్రాండ్‌ఫినాలేకు 50 మంది ..

BECIL Recruitment 2022: టెన్త్‌, ఇంటర్‌ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

Latest Articles