RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాల అంటూ పాట పాడిన ఈ మల్లి ఎవరో తెలుసా..?

దర్శక ధీరుడు రాజమౌళి(S. S. Rajamouli )తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాల అంటూ పాట పాడిన ఈ మల్లి ఎవరో తెలుసా..?
Malli
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2022 | 4:25 PM

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి(S. S. Rajamouli )తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూల్ చేసి తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది ఈ సినిమా. ఇద్దరు హీరోలతో జక్కన్న చేసిన మ్యాజిక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ చేత శబాష్ అనిపించుకుంటుంది. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులు కలిస్తే .. వారి మధ్య స్నేహం చిగురిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. ఎవరికీ వారు తగ్గకుండా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ మాత్రలను న్యాయం చేశారు. అలాగే ఈ సినిమాలో మల్లి అనే పాత్ర పైనే సినిమా అంతా ఆధారపడి ఉంటుంది.

Twinkle Sharma

గొండ్ల పిల్ల అయిన మల్లిని బ్రిటీష్ రాణి బానిసగా తనతో తీసుకెళ్లడంతో ఎన్టీఆర్ పాత్ర రంగంలోకి దిగుతుంది. అయితే మల్లి పాత్రలో నటించిన పాప గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.. పాత్ర చిన్నదే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఇంతకు ఈ పాప ఎవరంటే.. మల్లి పాత్రలో నటించిన పాప పేరు ట్వింకిల్ శర్మ.  ఈ చిన్నారి చండీఘర్ రాష్ట్రానికి చెందింది. డాన్స్ ఇండియా డ్యాన్స్ అనే రియాలిటీ షోతో ఈ పాప మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాడ్ లో కూడా నటించింది ట్వింకిల్ శర్మ. ఆ యాడ్ లో ఈ చిన్నారిని చూసిన రాజమౌళి మల్లి పాత్రకు ఎంపిక చేశారట. ‘కొమ్మ ఉయ్యాలా కోన జంపాల అంటూ’ మల్లి పాడే పాటతో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Malli

మరిన్ని ఇక్కడ చదవండి :  Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో.. Bhavana: చూపు తిప్పుకొనివ్వని అందాల భావన.. అందమే అసూయ పడనే నిన్ను చూసి.. OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!