OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!

కంటెంట్‌లో దమ్ముంటే.. తిరుగుండదు అనడానికి 'ఆర్ఆర్ఆర్' పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రస్తుతం బాక్స్‌ఆఫీస్ దగ్గర కలెక్షన్ల...

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!
Movies
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 31, 2022 | 1:50 PM

కంటెంట్‌లో దమ్ముంటే.. తిరుగుండదు అనడానికి ‘ఆర్ఆర్ఆర్’ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రస్తుతం బాక్స్‌ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్న ఈ సినిమాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో అటు థియేటర్లు.. ఇటు ఓటీటీలలో రిలీజవుతున్న చిత్రాలు ఏంటో చూసేద్దాం పదండి..

మిషన్ ఇంపాజిబుల్:

హీరోయిన్ తాప్సీ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ఆర్ఎస్‌జె స్వరూప్ దర్శకత్వం వహిస్తుండగా.. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాధేశ్యామ్‌:

ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాగా.. యావరేజ్‌ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఏప్రిల్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రవీణ్ తాంబే ఎవరు?

భారత క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో పోషిస్తున్నాడు. డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ మూవీ ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

హలో జూన్‌:

వెరైటీ కథలతో తెలుగువారికి కావల్సినంత వినోదాన్ని పంచుతున్న ‘ఆహా’ ఓటీటీలో మలయాళ మూవీ ‘జూన్‌’.. ఏప్రిల్ 1 నుంచి హలో జూన్‌ పేరుతో స్ట్రీమింగ్‌ కానుంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు:

శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఏప్రిల్ 2 నుంచి సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని సినిమాలు ఇలా ఉన్నాయి..

డిస్నీ+హాట్‌స్టార్: మూన్‌ నైట్‌ – మార్చి 30, భీష్మపర్వం – ఏప్రిల్‌ 1

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో: శర్మాజీ నమ్కీన్‌ – మార్చి 31

నెట్‌ఫ్లిక్స్‌: హే సినామిక – మార్చి 31, స్టోరీస్ ఆఫ్ విట్ అండ్ మ్యాజిక్(యానిమేషన్) – మార్చి 31, ది లాజ్‌ బస్‌(వెబ్‌ సిరీస్‌) – ఏప్రిల్‌ 1

Also Read:

Viral Video: ఏటీఎం నుంచి వింత శబ్దాలు.. భయంతో డోర్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్..

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేది మీ సీక్రెట్ చెప్పేస్తుంది!

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే