AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaalivaana: జీ5లో మరో థ్రిల్లింగ్ వెబ్ సిరిస్.. గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

బ్లాక్ బస్టర్ హిట్స్.. పాన్ ఇండియా చిత్రాలతో థియేటర్లకు మళ్లి పూర్వ వైభవం వచ్చింది. ఓవైపు ఓటీటీలు కూడా సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్,

Gaalivaana: జీ5లో మరో థ్రిల్లింగ్ వెబ్ సిరిస్.. గాలివాన ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Gaalivaana
Rajitha Chanti
|

Updated on: Apr 01, 2022 | 6:50 AM

Share

బ్లాక్ బస్టర్ హిట్స్.. పాన్ ఇండియా చిత్రాలతో థియేటర్లకు మళ్లి పూర్వ వైభవం వచ్చింది. ఓవైపు ఓటీటీలు కూడా సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాయి. ప్రేక్షకులను అంతులేని వినోదాన్ని అందించేందుకు ఓటీటీలు ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‏లను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో  మరో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజర్‌, లూజర్‌ 2 వంటి టాప్‌ నాచ్‌ సిరీస్‌ నిర్మించిన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ , అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి యురోపియన్‌ డ్రామాను తెలుగు మార్పులు చేసి జీ5 వారు ‘గాలివాన’ (Gaalivaana) అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తున్నారు. బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌ట్కెన్‌మెంట్‌ భాగ స్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‍ను నిర్మించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో మార్చి 31న కింగ్‌ అక్కినేని నాగార్జున ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ వీక్షకులను నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా సాగే ఈ ట్రైలర్‏లో రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. క్వాలిటీ పరంగా, విజువల్స్‌ పరంగా భారీతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గతంలో కొన్ని క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇందులో మాత్రం మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన క్రైం థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా క్యారీ చేసేలా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. సాయికుమార్‌ పాత్ర కూడా ఎమోషన్‌తో పాటు ఫ్యామిలీ బాండిరగ్‌కు ఉన్న విలువను చూపిస్తోంది.ఈ వెబ్‌ సిరీస్‌ను వీక్షకులకోసం ఏప్రిల్‌ 14న జీ5 ఓటిటిలో స్ట్రీమింగ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌ మరియు నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Ram Charan: జక్కన్న సినిమా ఇచ్చిన ఊపుతో టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న మెగాపవర్ స్టార్

Jana Gana Mana: ఇండియన్స్ ఆర్ టైగర్స్.. ఇండియన్స్ ఆర్ ఫైటర్స్.. ఆకట్టుకుంటున్న ‘జన గణ మన’ వీడియో

RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. స్ర్కీన్‌ ముందు ఫ్యాన్స్‌ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..

RRR movie : కొససాగుతున్న వసూళ్ల వేట.. ఆరు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎంత వసూల్ చేసిందంటే..

Follow Us
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే