RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. స్ర్కీన్‌ ముందు ఫ్యాన్స్‌ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..

RRR Movie: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR)ల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యా్ప్తంగా అత్యంత గ్రాండ్‌గా రిలీజైంది.

RRR Movie: నేపాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఫీవర్‌.. స్ర్కీన్‌ ముందు ఫ్యాన్స్‌ ఎలా ఊగిపోతున్నారో మీరే చూడండి..
Rrr
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2022 | 8:20 PM

RRR Movie: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR)ల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యా్ప్తంగా అత్యంత గ్రాండ్‌గా రిలీజైంది. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ థియేటర్లలోకి అడుగుపెట్టిన తర్వాత బ్లాక్‌బస్టర్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈక్రమంలోనే ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.700 కోట్ల వరకు సమీపించాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. కేవలం మన దేశంలోనే కాదు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఎన్టీఆర్​, రామ్‌చరణ్‌ల అభినయం, డ్యాన్స్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే నేపాల్​లో ఆర్​ఆర్​ఆర్ సినిమాను చూస్తోన్న అభిమానులు మైమర్చిపోయి థియేటర్లో డ్యాన్సులు చేశారు. స్ర్కీన్‌పై ఎత్తర జెండా సాంగ్‌ ప్లే అవుతుండగా ముందు వరుసలోని ఆడియన్స్‌ ఉత్సాహంతో ఊగిపోతూ స్టెప్పులేశారు.

మైండ్‌ బ్లోయింగ్‌ బ్రో..

కాగా దీనికి సంబంధించిన వీడియోను దినేశ్​ శ్రేష్ట అనే ట్విట్టర్​యూజర్ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. ‘నేపాల్​లో ఆర్ఆర్‌ఆర్​ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తే.. మతి పోతోంది’ అని ఆ పోస్టుకు క్యాప్షన్‌ పెట్టాడు. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చెర్రీ, తారక్‌లతో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ బ్యూటీ ఓలివియో మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ విజువల్‌ గ్రాండియర్‌ను నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.

Also Read:Afghanistan: గెడ్డంతో వస్తేనే గవర్నమెంటు ఆఫీసుల్లోకి ఎంట్రీ.. లేదంటే గెటౌట్.. ఇదేం పైత్యం సామి..

Yadadri Temple: యాదాద్రి కొండపైకి ఆ వాహనాలకు నో పర్మిషన్.. కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..

చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!