Afghanistan: గెడ్డంతో వస్తేనే గవర్నమెంటు ఆఫీసుల్లోకి ఎంట్రీ.. లేదంటే గెటౌట్.. ఇదేం పైత్యం సామి..

ఆఫ్గనిస్తాన్‌లో కరుడుగట్టిన తాలిబన్ల విచిత్ర ఆదేశాలు ఆ దేశంలో కల్లోలం సృష్టిస్తన్నాయి. మొన్న హిజాబ్‌ లేకపోతే చంపేశారు, నిన్న మహిళల ఒంటరి ప్రయాణాలను అడ్డుకున్నారు, నేడు గడ్డం గోల మొదలు పెట్టారు.

Afghanistan: గెడ్డంతో వస్తేనే గవర్నమెంటు ఆఫీసుల్లోకి ఎంట్రీ.. లేదంటే గెటౌట్.. ఇదేం పైత్యం సామి..
Afghanistan New Rule
Follow us

|

Updated on: Mar 31, 2022 | 8:04 PM

ఇకపై ఆఫ్గనిస్తాన్‌లో బ్లేడ్‌లకు గిరాకీ పడిపోబోతోంది. ఎందుకో తెలుసా? అక్కడ గడ్డం గీసుకునే వాళ్ళిక ఉండరు. ఎందుకంటారా? అక్కడ గెడ్డంపై బ్యాన్‌ కాదు. గెడ్డం లేకుండా ఉండడంపై బ్యాన్‌ విధించింది ప్రభుత్వం. ఆఫ్గాన్‌ తాలిబన్ల వశమయ్యాక తమలో చాలా మార్పుని కళ్ళజూస్తారంటూ ప్రకటనలు గుప్పించిన ఉగ్రమూక వ్యవహారం మరీ దారుణంగా తయారయ్యింది. స్త్రీలపైనా, ఆడపిల్లలపైనా అడ్డగోలు ఆదేశాలు అక్కడ కలకలం సృష్టిస్తున్నాయి. ఎక్కడైనా గెడ్డం లేకుండా క్లీన్‌ షేవ్‌తో ఆఫీసులకెళతారు. కానీ ఆఫ్గాన్‌లో మాత్రం డిసిప్లేన్‌ని గెడ్డంతో కొలుస్తున్నారు. గెడ్డంతో వస్తేనే గవర్నమెంటు ఆఫీసుల్లోకి ఎంట్రీ లేదంటే గెటౌటే. ఇది వట్టి మాట కాదు. తాలిబన్ల గట్టి మాట. వాళ్ళ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తున్నారేమోనని హఠాత్తుగా ప్రభుత్వ కార్యాలయాలపై మెరుపుదాడులకు దిగుతున్నారు.

ఎవరైనా నో అన్నా, గెడ్డం లేకుండా ఆఫీసులకొచ్చొనా ముష్కర మూక ఎంతకైనా తెగిస్తుంది. మత ఉన్మాదం అంతలా ముదిరింది మరి. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకుంటే గెడ్డం పెంచుకోండి. అంటూ ఆర్డర్స్‌ జారీచేస్తున్నారు. గెడ్డం ట్రిమ్‌ చేయించుకోవడం కూడా అక్కడ నేరంగా మారిపోయింది. అందుకే జనం బార్బర్‌ షాపుల కేసి కన్నెత్తి చూడటం మానేశారు. మొన్న ఆడపిల్లల చదువులపై ఆంక్షలు విధించారు. అమ్మాయిలు చదువుకోనక్కర్లేదంటూ హుకుం జారీచేశారు. ఆ తరువాత విదేశీ వస్త్రధారణని బ్యాన్‌ చేశారు. ఆడైనా, మగైనా విదేశీ వస్త్రాలు ధరిస్తే అంతే సంగతులని హెచ్చరించారు. అంతటితో ఆగితే వాళ్ళు తాలిబన్లెందుకవుతారు. స్త్రీ స్వేచ్ఛకి బద్ధ శతృవులైన తాలిబన్లు ఏకంగా ఆడవాళ్ళ ప్రయాణాలపైనా ఆంక్షల సంకెళ్ళు విధించారు. కుటుంబ సభ్యులైన పురుషుల్లేకుండా ఫ్లైట్‌ ఎక్కడానికి వీల్లేదన్నారు. అలా ఒంటరిగా వచ్చిన మహిళా ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా అడ్డుకొని తాలిబన్ల రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు.

ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల రాక్షస రాజ్యం కొనసాగుతోంది. గత ఆగస్టులో అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇటీవల తాలిబన్లు తాజాగా మరో హుకుం జారీ చేశారు. ఆఫ్గాన్‌ స్త్రీలనూ, పురుషులనూ వేర్వేరు రోజుల్లో పార్కులకు అనుమతిస్తున్నామంటూ ప్రకటన చేసింది ఆఫ్గాన్‌ ప్రభుత్వం. వారంలో మూడు రోజులు స్త్రీలను, నాలుగు రోజులు పురుషులను వేర్వేరుగా పార్కుల్లోకి అనుమతిస్తామంటోన్న తాలిబన్ల మతిభ్రమించిన వెర్రి చేష్టలకు అంతే లేకుండా పోతోంది. ఆఫ్గనిస్తాన్‌లో ఆడవాళ్ళకు అడుగడుగునా తాలిబన్ల వికృత రూపం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఆడవాళ్ళు అడుగుతీసి అడుగు వేస్తే ఎటునుంచి ఏం ముప్పు ముంచుకొస్తుందోనని ప్రాణాలరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. హిజాబ్‌ లేకుండా కనిపిస్తే ఖతం కార్యక్రమం మొదలుపెట్టారు.

గతంలో హిజాబ్‌ లేకుండా బయటకొచ్చిన ఆడపిల్లను నడిబజార్లో చిత్రహింసలు పెట్టి చావచితగ్గొట్టారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్‌ ప్రపంచంలోనే కరుడుగట్టిన స్త్రీ వ్యతిరేక పురుషాహంకార చీకటి సామ్రాజ్యంగా మారిపోయింది.

Also Read: April 1st: అమ్మో ఏప్రిల్ 1.. సామాన్యులకు షాకింగ్ న్యూస్.. బాదుడే.. బాదుడు..

Telangana: ఛీ.. ఛీ.. పాడి ఆవుపై పైశాచికం.. తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు కదరా..