Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.. ఈజీగా కనిపెట్టొచ్చండోయ్.!
వర్క్ నుంచి స్ట్రెస్ రిలీఫ్ పొందేందుకు కొంతమంది వెబ్ సిరీస్‌లపై తమ ధ్యాసను మళ్లిస్తారు. మరికొందరైతే పజిల్స్, సుడోకోలు..
వర్క్ నుంచి స్ట్రెస్ రిలీఫ్ పొందేందుకు కొంతమంది వెబ్ సిరీస్‌లపై తమ ధ్యాసను మళ్లిస్తారు. మరికొందరైతే పజిల్స్, సుడోకోలు సాల్వ్ చేస్తే.. తమ మెదడుకు పదును పెడతారు. ఇక అలాంటివారి కోసం ఇంటర్నెట్‌లో లెక్కలేనన్ని పజిల్స్ ఉన్నాయి. ఈ మధ్య ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని సాల్వ్ చేయాలంటే.. మీ మెదడు పదునుంటే సరిపోదు.. కళ్లకు కూడా పని చెప్పాల్సిందే.. అప్పుడే అందులో ఏముందో కనిపెట్టగలరు. కొంతమంది అయితే.. తగ్గేదేలే అన్నట్లుగా ఈ పజిల్స్‌ను పట్టు పడతారు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి పార్క్‌లా ఉన్న ఆ ప్రదేశంలో విషసర్పం జరజరా పాక్కుంటూపోతోంది. కాలు పడితే.. కాటు తప్పదు.. మరి మీ కళ్లకు పదునుంటే.. ఆ పాము ఎక్కడుందో గుర్తించండి. కొంతమంది ఈ పజిల్‌ను చిటికెలో సాల్వ్ చేసేయగా.. మరికొందరు అందులో పాము కనిపెట్టలేక ముప్పుతిప్పలు పడుతున్నారు. మరి మీరూ ట్రై చేయండి.. పామును కనిపెట్టలేకపోతే.. క్రింద ఫోటోలో సమాధానాన్ని చూడండి.
సమాధానం: ఫోటోలో కుడి చేతి వైపున సరిగ్గా మధ్యలో పాము కనిపిస్తుంది.
Here is the answer.. pic.twitter.com/qB62vYOpJZ
— telugufunworld (@telugufunworld) March 30, 2022