IPL 2022: ఈ కోల్‌కతా ఆటగాడు మొదటి బంతికే బౌల్డ్.. కానీ వికెట్ల వెనుక మ్యాజిక్ చేశాడు..!
IPL 2022: ఐపీఎల్ ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. ఆర్సీబీ 129 పరుగుల లక్ష్యాన్ని 4 బంతుల
IPL 2022: ఐపీఎల్ ఆరో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది. ఆర్సీబీ 129 పరుగుల లక్ష్యాన్ని 4 బంతుల ముందే సాధించింది. బెంగళూరు విజయంలో వనేందు హసరంగా 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్‌తో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షెల్డన్ జాక్సన్ 3 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్‌ను అందుకున్నాడు. అనూజ్ రావత్, విరాట్ కోహ్లి క్యాచ్ అవుట్ చేశాడు అలాగే షాబాజ్ అహ్మద్‌ను స్టంపౌట్ చేశాడు. అయితే షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ క్యాచ్‌ను షెల్డన్ జాక్సన్ పట్టుకున్న తీరు నిజంగా అద్భుతం.
షెల్డన్ జాక్సన్ ఆకర్షణీయమైన క్యాచ్
18వ ఓవర్‌లో టిమ్ సౌథీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతని రెండో బంతికి రూథర్‌ఫోర్డ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతని బ్యాట్ లోపలి అంచుని తాకి వికెట్ వెనుకకు వెళ్లింది. సాధారణంగా ఇలాంటి షాట్లు బౌండరీల వరకు వెళుతాయి. కానీ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ కుడివైపు డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ పట్టాడు. జాక్సన్ ఈ క్యాచ్ చాలా ప్రత్యేకమైనది. కానీ చివరికి ఆర్సీబీ విజయం సాధించింది.
బ్యాట్‌తో విఫలమైన షెల్డన్ జాక్సన్
RCBపై షెల్డన్ జాక్సన్ బ్యాట్‌తో విఫలమయ్యాడు. తొలి బంతికే వనేందు హసరంగా బౌలింగ్‌లో అవుటయ్యాడు. జాక్సన్ హసరంగా మొదటి బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను గూగ్లీని అంచనా వేయలేకపోయాడు. దీని కారణంగా అతని ఆఫ్-స్టంప్ ఎగిరిపోయింది. జాక్సన్ బ్యాట్‌తో విఫలమైనప్పటికీ వికెట్ కీపర్‌గా జట్టును గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. జాక్సన్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు.
@ShelJackson27 what a catch ? @msdhoni @KKRiders #whatacatch pic.twitter.com/QLbSg33ZwS
— sid (@siddheshnate) March 30, 2022