ఏప్రిల్‌ 1 నుంచి ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టండి.. మంచి రాబడిని పొందండి..!

Investment Plan: కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 రేపటి నుంచి (ఏప్రిల్ 1) ప్రారంభంకానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టే వారికి డిజిటల్ స్కీమ్‌లు మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఏప్రిల్‌ 1 నుంచి ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టండి.. మంచి రాబడిని పొందండి..!
Money Earning
Follow us
uppula Raju

|

Updated on: Mar 31, 2022 | 1:50 PM

Investment Plan: కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 రేపటి నుంచి (ఏప్రిల్ 1) ప్రారంభంకానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టే వారికి డిజిటల్ స్కీమ్‌లు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ రోజు నాలుగు డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలానికి ఇవి అనువుగా ఉంటాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మ్యూచ్‌వల్‌ఫండ్స్‌. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టలేకపోతే SIP(Systematic Investment Plan) ద్వారా ప్రతి నెలా పెట్టుబడి పెట్టే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో పన్ను ప్రయోజనాలు, అధిక రాబడిని సాధించవచ్చు. నేటి కాలంలో మీరు కనీసం రూ. 100 రూపాయలతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు.

రికరింగ్ డిపాజిట్

సురక్షితమైన పెట్టుబడికి రికరింగ్ డిపాజిట్ (RD) ఒక మంచి ఎంపిక. మార్కెట్ లింక్ కానందున ఇది పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడిని అందిస్తుంది. RD లో పెట్టుబడి పెట్టడం ద్వారా FD లేదా సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీని సంపాదించవచ్చు. ఇందులో ప్రతి నెలా నిర్ణీత తేదీన నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడిదారుడు స్థిర వడ్డీ రేటును పొందుతాడు. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి RD ఉత్తమ ఎంపిక. సాధారణంగా కనీసం రూ.500తో పెట్టుబడి పెట్టవచ్చు.

డిజిటల్ బంగారం

ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి డిజిటల్ బంగారం సులువైన మార్గం. బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత అది కస్టమర్ వాలెట్‌లో ఉంటుంది. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి మీకు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ అవసరం. మీరు మీ కోరిక మేరకు బంగారాన్ని అమ్మవచ్చు. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి మీరు Google Pay, PhonePe, Paytm మొదలైన ఈ-వాలెట్ కంపెనీలను ఉపయోగించవచ్చు. డిజిటల్ బంగారంలో బంగారం స్వచ్ఛతకి పూర్తి హామి ఉంటుంది. ఇందులో కేవలం 1 రూపాయితో పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

Travelling Plan: సాహసయాత్ర చేయాలనుకుంటే ఢిల్లీ నుంచి లేహ్ గొప్ప ఎంపిక.. ఎందుకంటే..?

New Cars: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. ఏప్రిల్‌లో విడుదలయ్యే కొత్త మోడల్స్‌ ఇవే..!

The Kashmir Files: 300 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’.. ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు..!