Travelling Plan: సాహసయాత్ర చేయాలనుకుంటే ఢిల్లీ నుంచి లేహ్ గొప్ప ఎంపిక.. ఎందుకంటే..?
Travelling Plan: ఢిల్లీ నుంచి లేహ్: రోడ్డు ప్రయాణాల విషయానికొస్తే ఢిల్లీ నుంచి లేహ్ గొప్ప సాహసయాత్రగా చెప్పవచ్చు. ఇందులో మనాలి మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
Updated on: Mar 31, 2022 | 12:12 PM

ఢిల్లీ నుంచి లేహ్: రోడ్డు ప్రయాణాల విషయానికొస్తే ఢిల్లీ నుంచి లేహ్ గొప్ప సాహసయాత్రగా చెప్పవచ్చు. ఇందులో మనాలి మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సమయంలో కనిపించే అందమైన దృశ్యాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి.

ఢిల్లీ-ఆగ్రా-జైపూర్: ఈ రోడ్ ట్రిప్ కోసం మీరు NH 93, NH 8లను దాటవలసి ఉంటుంది. దీని పొడవు దాదాపు 450 కి.మీ. ఈ రెండు నగరాలు చారిత్రాత్మకంగా సంపన్నమైనవి.

ఢిల్లీ టు స్పితి వ్యాలీ: ఈ రోడ్ ట్రిప్ సాహసాలు, ప్రమాదాలతో నిండి ఉంటుంది. దాదాపు 700 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

చండీగఢ్ నుంచి కసోల్: హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాలలో కసోల్ ఒకటి. సాహసయాత్రకు ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మీరు చండీగఢ్ నుంచి కసోల్ వరకు రోడ్ ట్రిప్ చేయవచ్చు. దీని కోసం పర్వతాల గుండా 273 కి.మీ దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

అహ్మదాబాద్ నుంచి కచ్: ఈ మార్గంలో మీరు ఎడారి గ్రామాల సుందర దృశ్యాలని చూస్తారు. ఈ రెండు నగరాలు రోడ్ ట్రిప్‌లకు అక్టోబర్ నుంచి మార్చి సమయం ఉత్తమం. ఈ రోడ్ ట్రిప్ సమయంలో దాదాపు 454 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది.



