Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: అందుకే ఆర్ఆర్ఆర్ ఫోటోలు డిలీట్ చేశాను.. అసలు విషయం చెప్పేసిన అలియా..

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ రావడంతో మనదేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

Alia Bhatt: అందుకే ఆర్ఆర్ఆర్ ఫోటోలు డిలీట్ చేశాను.. అసలు విషయం చెప్పేసిన అలియా..
Rrr Movie
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2022 | 3:54 PM

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గత శుక్రవారం (మార్చి 25)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ రావడంతో మనదేశంతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజే రూ.223 కోట్లు కొల్లగొట్టిన ఈ ఫిక్షనల్‌ థ్రిల్లర్‌ ఇప్పటివరకు రూ. 600 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), జూనియర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) అభినయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సినిమా చూసిన వారందరూ రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ (Aliabhatt) ఓ కీలక పాత్రలో నటించింది. రామ్‌చరణ్‌ కు జోడీగా సీత పాత్రలో నటించి మెప్పించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత పాత్ర నిడివి విషయంలో అలియా అసంతృప్తిగా ఉందని.. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియాతో పోలిస్తే తన పాత్ర చాలా తక్కువగా ఉందని ఆమె ఫీలైందని పుకార్లు షికార్లు చేశాయి. ఆ కోపంతోనే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌ నుంచి తొలగించిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు తన ఇన్‌స్టా ఖాతా నుంచి రాజమౌళిని అన్‌ఫాలో చేశారన్న రూమర్లు బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా తనపై సాగుతోన్న ఈ ప్రచారం, వార్తలపై అలియా స్పందించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది.

ఆ వార్తలు విని అప్సెట్ అయ్యాను..

అందులో ‘ ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో నేను అప్‌సెట్‌ అయ్యానని, ఆకారణంగానే నా సోషల్ మీడియా అకౌంట్ లో వున్న సినిమా ఫొటోలను తొలగించానంటూ జరుగుతున్న ప్రచారాన్ని విన్నాను. సోషల్‌ మీడియాలో ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేయవద్దని అందరినీ వేడుకుంటున్నాను. నా సోషల్ మీడియా అకౌంట్లో వున్న ఓల్డ్ వీడియోలు, ఫొటోలని అప్పుడప్పుడూ తొలగిస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలని కూడా తొలగించాను అంతే. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే ఓ ప్రపంచంలో లో నేను ఓ భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. సీత పాత్రను ఎంతో ప్రేమతో చేశాను. రాజమౌళి సార్‌ దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు సంబంధించి  నేను వెచ్చించిన  ప్రతిక్షణం నాకు మధరానుభూతులను మిగిల్చింది . ఇక ఇప్పుడు ఇలా నేను వివరణ ఇవ్వడానికి ప్రధాన కారణమేంటంటే.. రాజమౌళి సార్‌, ఆయన చిత్రబృందం ఎన్నో ఏళ్లు శ్రమించి ఈ అద్భుతమైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. అలాంటి సినిమా చుట్టూ తప్పుడు ప్రచారం జరగడం నాకు నచ్చడం లేదు. అందుకే ఇలా వివరణ ఇస్తున్నాను’ అని అందులో రాసుకొచ్చింది అలియా. దీంతో రాజమౌళిపై అలియా అలకబూనిందన్న వార్తలు, రూమర్లకు చెక్‌ పెట్టినట్లైంది.

Alia Bhatt

Also Read:Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ‘సర్కారు వారి పాట’లో అదే హైలైట్.?

srinidhi shetty: పూల ఋతువుల కోమలిలాగ ఫ్యాన్స్ మతి పోగొడుతున్న కేజీఎఫ్ ముద్దుగుమ్మ ‘శ్రీనిధి శెట్టి’..

Boat Wave Lite: బోట్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..