Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. ‘సర్కారు వారి పాట’లో అదే హైలైట్.?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమానుంచి ఏచిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. 'సర్కారు వారి పాట'లో అదే హైలైట్.?
Sarkaru Vaari Paata
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2022 | 6:24 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటిస్తున్న సర్కారు వారి పాట సినిమానుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ మారిపోతుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మహేష్ సరసన అందాల ముద్దుగుమ్మ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పెయిర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ , కళావతి, పెన్నీ పాటలను విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆ మధ్య కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయట. యాక్షన్ తోపాటు కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందని తెలుస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు పై కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగు లో జరుగుతుందని తెలుస్తుంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన రైల్వే స్టేషన్ సెట్లో ఒక భారీ యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నారట. ఈ ఫైట్ సీన్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ ఉంటుందని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్ తో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేస్తారట. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘ఉగాది’కి ఈ సినిమానుంచి థర్డ్ సింగిల్ వస్తుందని మహేష్చె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మహేశ్ – వెన్నెల కిశోర్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను మే 12 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..

Bhavana: చూపు తిప్పుకొనివ్వని అందాల భావన.. అందమే అసూయ పడనే నిన్ను చూసి..

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!