Rajinikanth : సూపర్ స్టార్‌కు జోడీగా మరోసారి ఆ ప్రపంచ సుందరి.. ఏ సినిమాలో అంటే

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కొసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ నుంచి ఓ సాలిడ్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Rajinikanth : సూపర్ స్టార్‌కు జోడీగా మరోసారి ఆ ప్రపంచ సుందరి.. ఏ సినిమాలో అంటే
Supar Star
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2022 | 5:58 PM

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) సినిమా కొసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ నుంచి ఓ సాలిడ్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజినీకాంత్ చేసిన సినిమాలు ఇటీవల ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన అన్నత్తే సినిమా కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు తలైవా చేసే నెక్స్ట్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. రజినీకాంత్ 169వ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విభిన్నమైన కథాంశాలతో నెల్సన్ తెరకెక్కించే సినిమాలు మంచి విజయాలను  అందుకున్నాయి. ఇటీవల శివ కార్తికేయతో డాక్టర్ వరుణ్ అనే సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత నెల్సన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్ టైనర్ ను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తాడని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ సినిమా లో హీరోయిన్స్ గా ఐశ్వర్య రాయ్,  ప్రియాంక అరుల్ మోహన్ లు నటించబోతున్నట్లుగా కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే నెల్సన్ తెరకెక్కించిన డాక్టర్ వరుణ్ సినిమాలో ప్రియాంక నటించిన విషయం తెలిసిందే.. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఐశ్వర్య రాయ్ కలిసి చేసిన రోబో సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ జోడీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Aishwarya Rai

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..

Bhavana: చూపు తిప్పుకొనివ్వని అందాల భావన.. అందమే అసూయ పడనే నిన్ను చూసి..

OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజయ్యే సినిమాలివే.. లిస్టులో రెండు బడా హీరోల చిత్రాలు!