Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..
Hair Care Tips: ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. తప్పుడు ఆహారం, కాలుష్యం, జీవనశైలిలో మార్పులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
Hair Care Tips: ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. తప్పుడు ఆహారం, కాలుష్యం, జీవనశైలిలో మార్పులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. జుట్టు పాడైపోయి. రకరకాల సమస్యలు తలెత్తుతాయి. జుట్టు నిర్జీవంగా, కళావిహీనంగా మారిపోతుంది. జుట్టు రాలిపోయి పలుచబడిపోతుంది. అయితే, జుట్టు మెరవాలన్నా.. జుట్టు రాలే సమస్య తగ్గి.. ఒత్తుగా మారాలన్నా.. రివర్స్ హెయిర్ వాష్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఈ రివర్స్ హెయిర్ వాష్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రివర్స్ హెయిర్ వాష్ అంటే ఏమిటి.. రివర్స్ హెయిర్ వాష్ అనేది చాలా సింపుల్ టెక్నిక్. సాధారణంగా జుట్టు తడిసిన తర్వాత ముందుగా షాంపూ, తర్వాత కండీషనర్ అప్లై చేస్తారు. కానీ, ఇందులో రివర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగా కండీషనర్ అప్లై చేసి.. ఆ తరువాత షాంపూ అప్లై చేయాలి. ఇందుకోసం ముందుగా జుట్టుకు కండీషనర్‌ను అప్లై చేయాలి. కండీషనర్‌ను జుట్టుకు అప్లై చేసి.. ఐదు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత జుట్టును కడిగి.. ఆ తర్వాత షాంపును అప్లై చేయాలి.
రివర్స్ హెయిర్ వాష్ ప్రయోజనాలు.. మీ జుట్టు జిడ్డుగా ఉంటే రివర్స్ హెయిర్ వాష్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది . ఇది జుట్టును ఫ్రీగా, సిల్కీగా చేస్తుంది. రివర్స్ హెయిర్ వాష్ వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టును క్లీన్ చేస్తుంది. షైనింగ్‌తో పాటు.. జుట్టు పరిమాణం కూడా పెరుగుతుంది. జుట్టు చీలిపోయే సమస్య తగ్గుతుంది.
గమనిక.. రివర్స్ హెయిర్ వాష్ అనేది సన్నగా, బలహీనమైన జుట్టు ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. జుట్టు వత్తుగా, ఆరోగ్యంగా ఉన్నవారు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జుట్టుకు సంబంధించి సమస్యలేవైనా ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
Also read:
Hyderabad: అతనికి ‘కల’ వచ్చిందంటే ఖతమే.. ఫుట్‌పాత్‌పై ఉంటూ కోట్లు కూడబెట్టిన దొంగ..!
Ugadi 2022: ‘‘శుభకృత్’ అంతా శుభమే జరగాలి’.. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు..!