Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramadan 2022: రంజాన్‌ ఉపవాసాలు పాటిస్తున్నారా? అయితే మీ ఆహారంలో ఇవి తప్పక ఉండాల్సిందే..

Ramadan Fastings: రంజాన్‌ మాసం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ముస్లింలు ఎంతో నిష్టగా రోజా (ఉపవాస దీక్ష) పాటిస్తారు. ఈనెలరోజుల పాటు ఉదయాన్నే తెల్లవారుజామున భోజనం (సెహెరీ) చేసి.. సూర్యస్తమయం వరకు ఎలాంటి ఆహార పదార్థాలను తినరు.

Ramadan 2022: రంజాన్‌ ఉపవాసాలు పాటిస్తున్నారా? అయితే మీ ఆహారంలో ఇవి తప్పక ఉండాల్సిందే..
Ramadan 2022
Follow us
Basha Shek

|

Updated on: Apr 01, 2022 | 10:00 PM

Ramadan Fastings: రంజాన్‌ మాసం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ముస్లింలు ఎంతో నిష్టగా రోజా (ఉపవాస దీక్ష) పాటిస్తారు. ఈనెలరోజుల పాటు ఉదయాన్నే తెల్లవారుజామున భోజనం (సెహెరీ) చేసి.. సూర్యస్తమయం వరకు ఎలాంటి ఆహార పదార్థాలను తినరు. సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ఇఫ్తార్‌తో ఉపవాస దీక్షను విరమిస్తారు. అంటే సుమారు 13 నుంచి 14 గంటల పాటు కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోకూడదన్నమాట. అయితే ఇలా 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం వల్ల చాలా మందికి కొన్నిసార్లు నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. అటువంటి వారు సెహెరీ, ఇఫ్తార్ సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా బాడీ డీహైడ్రేట్ కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. త్వరగా ఆకలివేయదు. మరి రోజా సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటే..

దోసకాయ దోసకాయ దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. అంతేకాదు దీనిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఉపవాస సమయంలో దోసకాయను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. అంతేకాదు ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

పుచ్చకాయ పుచ్చకాయలో కూడా దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. పైగా ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ఈసారి మండు వేసవిలో ఉపవాస దీక్షలు పాటించాల్సి వస్తుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే పుచ్చకాయ లాంటి నీటితో ఉన్న పండ్లను అధికంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొబ్బరి నీళ్లు సాయంత్రం ఇఫ్తార్‌ సమయంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం ఎంతో మంచింది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా కిడ్నీలో రాళ్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

పళ్ల రసాలు.. సెహెరీ, ఇఫ్తార్‌ సమయాల్లో పళ్ల రసాలను తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ముఖ్యంగా నారింజ, యాపిల్‌ వంటి పండ్ల రసాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అదే సమయంలో ఆహారంలో ఉప్పు, కారం లాంటి వాటిని తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

పాలు రంజాన్ డైట్‌లో పాలను కూడా చేర్చుకోవచ్చు. ఇది రీహైడ్రేటర్‌గా పనిచేస్తుంది. ఇది ఉపవాసం ఉన్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది. అదేవిధంగా శరీరానికి తగిన క్యాల్షియంను అందిస్తుంది.

పెరుగు పెరుగులో కూడా దాదాపు 80 శాతం నీరు ఉంటుంది. పైగా ఇందులో తగినంత ప్రోటీన్, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇవి బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహకరిస్తాయి.

నల్ల రేగు పండ్లు బ్లాక్‌బెర్రీ పండ్లు 80 శాతం నీటితో నిండి ఉంటాయి. అందుకే వీటిని హైడ్రేటింగ్ స్నాక్‌గా పరిగణిస్తారు. వీటిలె విటమిన్ సి, కె, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం కేవల అవగాహన కోసం మాత్రమే. TV9 వీటిని ధ్రువీకరించదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని అనుసరించండి

Also Read: Hair Care Tips: అందమైన కురులు కావాలంటే రివర్స్ హెయిర్ వాష్ ట్రై చేయండి.. పూర్తి వివరాలివే..

Crime news: బాలుడు అదృశ్యం.. కాలువలో మృతదేహం లభ్యం.. చేతులు కట్టేసి, అత్యంత దారుణ స్థితిలో

KKR vs PBKS: 4వికెట్లతో సత్తా చాటిన ఉమేష్ యాదవ్.. తక్కువ స్కోర్‌కే పంజాబ్ ఆలౌట్.. కోల్‌కతా టార్గెట్ 138..