- Telugu News Photo Gallery Ramzan 2022 keep these things in sehri time you will feel yourself energetic
Ramzan 2022: ఉపవాసం ఉండాలనుకుంటున్నారా..? ఇవి తింటే రోజంతా ఉత్సాహంగా ఉండోచ్చు..
Ramadan sehri time food: రంజాన్ మాసం ప్రారంభంకానుంది. ఆదివారం లేదా.. సోమవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ఉపవాసం ఉండటం వల్ల చాలా మందికి కొన్నిసార్లు బలహీనంగా అనిపిస్తుంది. ఈ సమయంలో సెహ్రీ వేళలో (ఉదయం వేళ) తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టడం మంచిది. ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Shaik Madar Saheb | Edited By: Ravi Kiran
Updated on: Apr 02, 2022 | 6:07 AM

రంజాన్‌లో సెహ్రీ సమయంలో (ఉదయం వేళ) ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అవి మిమ్మల్ని చాలా కాలం పాటు ఆకలిని నియంత్రించి కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి.

సహరీ సమయంలో ఓట్స్, మల్టీగ్రెయిన్ పరాఠాలను తినవచ్చు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి.

సెహ్రీ సమయంలో మితమైన ఆహారం తీసుకోండి. పెద్ద మొత్తంలో తినడం, తాగడం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

ఈ సమయంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవడం చాలామంచిది. ఇవి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి పని చేస్తాయి.

సెహ్రీ సమయంలో ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగడాన్ని నివారించండి. కాఫీ, టీ వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.





























