Crime news: బాలుడు అదృశ్యం.. కాలువలో మృతదేహం లభ్యం.. చేతులు కట్టేసి, అత్యంత దారుణ స్థితిలో
ఆడుకోవడానికి బయటకు వెళ్తానని చెప్పి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజులైనా కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాలువలో బాలుడి మృతదేహం...
ఆడుకోవడానికి బయటకు వెళ్తానని చెప్పి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజులైనా కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాలువలో బాలుడి మృతదేహం లభ్యమవడం సంచలనంగా మారింది. బాలుడి చేతులు కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. బాలుడి మృతదేహం లభ్యమైన రోజు అమావాస్య కావడంతో గ్రామస్థులు పలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్(Nizamabad) ఆటోనగర్ నయా బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ ఫయాజ్ గురువారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యాడు(Missing). బాలుడి ఆచూకీ కోసం అతని తండ్రి యూనస్ చుట్టుపక్కల వెదికాడు. అయినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నిజాంసాగర్(Nizam sagar Canal) డీ-54కాలువలో బాలుడి మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. డెడ్‌బాడీని బయటకు తీశారు.
బాలుడి రెండు చేతులను తాళ్లతో కట్టేసి ఉండటంతో హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి రెండు చేతులు కట్టేసి, కాలువలో పడేసి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా బాలుడి తల్లిదండ్రుల్ని పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు బాలుడు గురువారం మాయమై శుక్రవారం అమావాస్య రోజున శవమై తేలడంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా సాక్ష్యాలు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.
Also Read
Hyderabad: అతనికి ‘కల’ వచ్చిందంటే ఖతమే.. ఫుట్‌పాత్‌పై ఉంటూ కోట్లు కూడబెట్టిన దొంగ..!
గని ప్రమోషన్ లో ఫుల్ జోష్ తో మెగా హ్యాండ్సమ్ హీరో
Big News Big Debate Live: ధాన్యంపై రైతులను దగా చేస్తున్నదెవరు.? పండిన పంట అమ్మేదెలా? కొనేదెవరు.?