Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!

Silly Robbery: సమయంలో అర్థరాత్రి 12 గంటలవుతోంది. నడిరోడ్డుపై ఒక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాడు. రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిరాణాషాపులు ఉన్నాయి. మనసులోని కోరిక మేరకు..

Silly Robbery: వీడో విచిత్ర దొంగ.. 3 షాపుల్లో లూటీ.. 20 రూపాయలు చోరీ.. కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 01, 2022 | 7:23 PM

Silly Robbery: సమయంలో అర్థరాత్రి 12 గంటలవుతోంది. నడిరోడ్డుపై ఒక్కడే అటూ ఇటూ తిరుగుతున్నాడు. రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిరాణాషాపులు ఉన్నాయి. మనసులోని కోరిక మేరకు కొన్ని షాపులను టార్గె్ట్ చేసుకున్నాడు. ఇంకేముంది.. అదును చూసి ఒక్కో షాపులో దూరిపోయాడు. మూడు దుకాణాల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. మరి ఇంత పకడ్బందీగా చోరీకి పాల్పడ్డాడు అంటే.. భారీగా దోచుకెళ్లాడనే భావన సహజంగానే వస్తుంది. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ దొంగ మూడు షాపుల్లో చోరీకి పాల్పడి.. కేవలం 20 రూపాయలు మాత్రమే ఎత్తుకెళ్లాడు. అది కూడా ఎందుకోసమో తెలుసా?.. కరకరలాడే చిప్స్ తినాలనిపించి.. ఆ చోరీకి పాల్పడ్డాడట. ఈ విచిత్ర దొంగతనం.. రాజస్థాన్‌లోని సికర్ జిల్లా ఫతేపూర్‌లో వెలుగు చూసింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేపూర్‌లో దుర్గా మార్కెట్‌లో గుర్తు తెలియని వ్యక్తి మూడు షాపుల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ విజువల్స్ ఆధారంగా నిందితుడు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ దొంగకు టైమ్ పాస్ కోసం చిప్స్ తినాలని అనిపించిందట. తన వద్ద డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ క్రమంలోనే.. అతను మూడు షాపుల్లో చోరీకి పాల్పడ్డాడు. మరి మూడు షాపుల తాళాలు పగులగొట్టి అతను ఎత్తుకెళ్లింది కేవలం 20 రూపాయలు మాత్రమే అని తెలుసుకుని పోలీసులు బిత్తరపోయారు. అయితే, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనికి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని సబ్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ సింగ్ తెలిపారు. చోరీకి పాల్పడిన విషయాన్ని నిందితుడు అంగీకరించాడని, అయితే అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతో అతనికి చికిత్స అందించాల్సి ఉందని ఎస్సై చెప్పారు.

Also read:

IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఆరోజు నుంచి స్టేడియాల్లో..

తాలిబాన్‌ను తేలికగా తీసుకోకూడదు.. 9/11 పునరావృతం కావచ్చు.. ఇంటర్య్వూలో అఫ్ఘాన్ మహిళ సంచలన వ్యాఖ్యలు!

Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!