Ugadi 2022: ‘‘శుభకృత్’ అంతా శుభమే జరగాలి’.. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు..!
Ugadi 2022: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం..
Ugadi 2022: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని సీఎం తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని సీఎం అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సీఎం అన్నారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. వ్యవసాయం బాగుంటేనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జిడిపికి దోహదపడడంలో ముందున్నదన్నారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోశిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామనీ, ‘శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు.
Also read:
IPL 2022: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఆరోజు నుంచి స్టేడియాల్లో..
తాలిబాన్‌ను తేలికగా తీసుకోకూడదు.. 9/11 పునరావృతం కావచ్చు.. ఇంటర్య్వూలో అఫ్ఘాన్ మహిళ సంచలన వ్యాఖ్యలు!
Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన