AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megha Group: హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్.. డ్రిల్‌మెక్‌చే ఇడ్రోజెన స్టార్ట్‌అప్‌ ప్రారంభం

భావి ఇంధనంగా పరిగణిస్తున్న హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (MEIL) అడుగు పెడుతోంది.

Megha Group: హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి మేఘా గ్రూప్.. డ్రిల్‌మెక్‌చే ఇడ్రోజెన స్టార్ట్‌అప్‌ ప్రారంభం
Meil
Balaraju Goud
|

Updated on: Apr 01, 2022 | 5:50 PM

Share

MEIL’s Drillmec: భావి ఇంధనంగా పరిగణిస్తున్న హైడ్రోజన్(Hydrogen) ఉత్పత్తి రంగంలోకి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (Megha Engineering & Infrastructures Limited) అడుగు పెడుతోంది. మేఘా గ్రూపు కంపెనీ డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ ఈ రంగంలో 35 మిలియన్‌ యూరోల దాదాపు రూ.300 కోట్లు పెట్టుబడిని పెట్టేందుకు నిర్ణయించింది. హైడ్రోజన్ ఉత్పత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో ఫైరోలిటిక్ కన్వర్టర్ డ్రిల్ మెక్ తయారు చేసింది. ఈ టెక్నాలజీతో హైడ్రోజన్ ఉత్పత్తి, పంపిణీ సులభతరం కానుంది. హైడ్రోజన్ ఉత్పత్తితో పాటు జియోధర్మల్(Geothermal Energy) ఎనర్జీ ను సైతం డ్రిల్‌ మెక్‌ ఉత్పత్తి చేయనుంది. ప్రాసెస్ ఇంజినీరింగ్‌లో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న ఇడ్రోజెన ఇంజినీర్లు కన్వర్టర్ను డ్రిల్ మెక్ డిజైన్ చేసింది. ఇప్పటికే హైడ్రోకార్బన్స్‌ రంగంలో అన్ని విభాగల్లోనూ విస్తరించిన మేఘా గ్రూపు ఈ కొత్త ఇంధన రంగంలో ప్రవేశించడం ద్వారా విశ్వవ్యాప్తంగా తన సత్తాను చాటుకుంది. ఇటలీలోని పియుచెంజాలో జరిగిన డ్రిల్‌మెక్‌ బోర్డు సమావేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు.

హైడ్రోజన్‌ ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు ఐన ఎలక్ట్రోలైసిస్‌, పైరోలైసిస్‌లను వినియోగించడంతో పాటు కార్బన్‌ క్యాప్చర్‌, స్టోరేజి వ్యవస్థ డిజైన్‌, నిర్మాణాలను, జియో థర్మల్‌ ఎనర్జీ ఉత్పత్తిని డ్రిల్ మెక్ చేపట్టనుంది. అందులో భాగంగా ఇడ్రోజెన అనే స్టార్ట్‌అప్‌ కంపెనీని డ్రిల్‌మెక్‌ ప్రారంభించింది. ఈ కంపెనీ అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ ఉత్పత్తి కోసం పైరోలిటిక్‌ కన్వర్టర్‌‌ను అభివృద్ది పరిచి తయారు చేస్తుంది. ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌లో 30 ఏండ్లకు పైగా అనుభం ఉన్న ఇడ్రోజెన ఇంజినీర్లు కన్వర్టర్‌ను డిజైన్‌ చేశారు. ఎలాంటి కాలుష్య కారకాలను వినియోగించకుండానే పైరాలిసిస్‌ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఈ కన్వర్టర్‌ ఉత్పత్తి చేస్తుంది. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ, అందరికీ అందుబాటులో ఇంధనం తదితర లక్ష్యాలతో జరుగుతున్న ఇంధనరంగ పరివర్తనలో భాగంగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. .

ఈ సందర్భంగా డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ ఛైర్మన్‌ బొమ్మారెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ “ఈ కొత్త ఆవిష్కరణ చేస్తున్న డ్రిల్‌మెక్‌ టీమ్‌ను అభినందిస్తున్నాను. వేగంగా వృద్ధి చెందుతున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ టెక్నాలజీలలో వారంతా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను”. అని అన్నారు. ఈ కొత్త టెక్నాలజీని అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయడం వల్ల తక్కువ పీడనంతో నిర్వహించడంతో పాటు, కనీస శిక్షణతో సురక్షితంగా వినియోగించవచ్చు. పునరుత్పాదక ఇంధనంతో పనిచేయడం వల్ల కాలుష్య కారకాల వినియోగం ఉండదు. అలాగే వ్యర్థాల ఉత్పత్తి కూడా జరగదు. పరిశ్రమల్లో వినియోగంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థల్లో వినియోగించడగలగడం వంటి బహుళ ప్రయోజనాలకు అవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు అని శ్రీనివాస్ అన్నారు.

డ్రిల్‌మెక్‌ ఎస్‌పీఏ సీఈఓ సిమోన్‌ ట్రెవిసాని మాట్లాడుతూ “దేశంలో ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇంధన, సామాజిక, పర్యావరణ అవసరాలకు తగ్గట్టుగా బాధ్యాయుతమైన, సురక్షితమైన సాంకేతిక పరిజ్ణానాలను అభివృద్ధి చేయడంలో డ్రిల్‌మెక్‌ నిరంతరంగా కృషి చేస్తుంది.” అని అన్నారు. గత 120 ఏండ్లుగా చేస్తున్న కృషి ఫలితంగానే కార్భన్‌ డై ఆక్సైడ్‌కు బదులు గ్రాఫైట్‌ ఉత్పత్తి అయ్యే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయగలుగుతున్నాం. వాస్తవానికి గ్రాఫైట్‌ను విరివిగా ఉపయోగించే ఆటోమోటివ్, కాస్మటిక్స్, ఫార్మాస్యూటికల్స్‌ వంటి భారీ పరిశ్రమల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి ని నిలవరించే శక్తి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయని ఆయన ఆయన తెలిపారు.

కన్వర్టర్‌ ద్వారా హైడ్రోజన్‌‌ను అతి తక్కువ స్థలంలో అవసరం ఉన్న చోట పైపుల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలాగే స్టోరేజి రవాణా సవాళ్లను అధిగమించవచ్చు. “ఈ టెక్నాలజీ సహజ వాయువు వాల్యూచైన్‌లో ఇమడగలుగుతుంది. అందువల్ల ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రావడానికి అడ్డంకులుగా ఉన్న హైడ్రోజన్‌ పంపిణీ వ్యవస్థ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.” అని సిమోన్ ట్రెవిసాని అన్నారు.

Read Also…  RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’ను వెతుక్కుంటూ రికార్డులు వాటంతటవే వస్తున్నాయి.. వారం రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..