Vitamin E Oil: కళ్ళు చుట్టూ వలయాలు, ముఖంపై టాన్‌ను పోగొట్టడంలో విటమిన్-ఇ ఆయిల్ ఎంత మేలు చేస్తుందో తెలుసా…!
Vitamin E Oil: మారుతున్న కాలంలో మారిన అలవాట్లు, వాతావరణ కాలుష్యం తో చర్మం పై టాన్ పేరుకుపోవడం, ముడతలు వంటి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే విటమిన్-ఇ..
Vitamin E Oil: మారుతున్న కాలంలో మారిన అలవాట్లు, వాతావరణ కాలుష్యం తో చర్మం పై టాన్ పేరుకుపోవడం, ముడతలు వంటి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే విటమిన్-ఇ చర్మానికి మేలు చేస్తుంది. అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ ముఖానికి వృద్ధాప్య నివారణకు గొప్ప చికిత్స. అంతేకాదు సూర్యరశ్మి(Sun Heat) .. వయస్సు వల్లఏర్పడే ముడతల నుంచి రక్షిస్తుంది. ఈ నేపథ్యంలో విటమిన్-ఇ ఆయిల్ ప్రయోజనాలు .. ఎలా ఉపయోగించాలి ఈరోజు తెలుసుకుందాం..
చర్మానికి అప్లై చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముందుగా చర్మం పై మేకప్ లేదా క్రీమ్ వంటివి ఉంటే రిమూవ్ చేయండి. అనంతరం ముఖాన్ని గోరు వెచ్చటి నీటిలో శుభ్రం చేసుకోండి. అనంతరం మెత్తటి గుడ్డతో చర్మాన్ని సున్నితంగా తుడుచుకోవాలి. అనంతరం విటమిన్-ఇ ఆయిల్ అప్లై చేయాలి.
స్వచ్ఛమైన విటమిన్-ఇ ఆయిల్ లేదా క్యాప్సూల్స్‌ను ఉపయోగిస్తుంటే.. 10 చుక్కల జోజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనెకు ఒకటి లేదా రెండు చుక్కల విటమిన్-ఇ ఆయిల్ జోడించండి. ఈ మిక్స్డ్ ఆయిల్ లేదా సీరమ్‌ని చర్మంపై అప్లై చేసి.. అనంతరం ముఖాన్ని ముని వేళ్లతో వృత్తాకారంలో మసాజ్ చేయండి. అప్పుడు ఆయిల్ చర్మంలోకి చేరుకుంటుంది. ఆయిల్ అప్లై చేసి 20 నిముషాల అనంతరం ముఖాన్ని గోరు వెచ్చటి నీటితో శుభ్రంచేసుకోండి. ఇలా వారానికి ఒకసారి ముఖానికి ఈ విటమిన్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫేస్ కు అప్లై చేయడం వలన మొటిమలు తగ్గుతాయి. విటమిన్-ఇ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు: చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. సన్ టాన్ పోగొట్టుకోవడానికి విటమిన్-ఇ క్యాప్సూల్స్‌ను ఒక టేబుల్ స్పూన్ పెరుగు లేదా నిమ్మరసంతో కలపండి. అనంతరం ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 15 నిమిషాల గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమల నివారణ కోసం.. విటమిన్-ఇ ఆయిల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఈ ఆయిల్ ను నేరుగా ముఖంపై ఉన్న మచ్చలపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా నల్లని మచ్చలు, మొటిమలు తగ్గేవరకూ చేయాల్సి ఉంటుంది. విటమిన్ ఇ ఆయిల్ జుట్టు ఓడిపోవడానికి నివారిస్తుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. విటమిన్-ఇ నూనె ఒక ముఖ్యమైన కొవ్వు ఆమ్లం. దీనిలో ఉండే ఆల్ఫా-టోకోఫెరోల్ అనే రసాయనం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, పిహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచడం ద్వారా హెయిర్ ఫోలికల్స్ అంటే స్కాల్ప్ లోపలి భాగాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. కళ్ళు కింద నల్లటి వలయాలు ఉన్నవారికి మంచి మెడిసిన్ విటమిన్ ఇ ఆయిల్. కళ్ల కింద నల్లటి వలయాలు, ఉబ్బినట్లు ఉంటే.. నిద్రపోయే ముందు.. విటమిన్-ఇ నూనె ను కళ్ళ చుట్టూ.. స్మూత్ గా అప్లై చేసి.. తెలిపాటి మసాజ్ చేయాలి. ఇలా 2-3 వారాలు క్రమం తప్పకుండా చేస్తే.. కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. కళ్ళు కాంతివంతంగా కనిపిస్తాయి.
విటమిన్ ఈ ఆయిల్ ఎలా ఉపయోగించాలంటే.. విటమిన్ ఇ ఆయిల్ క్యాప్యూల్ లేదా ఆయిల్ ను రోజుకి ఎక్కువగా ఉపయోగించవద్దు. రోజుకి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.
తీసుకోవలసి జాగ్రత్తలు: విటమిన్-ఇ ఆయిల్ ను రోజూ చర్మంపై ఉపయోగించవచ్చు. అయితే ఎవరైనా సరే ఇ ఆయిల్ ఉపయోగించే ముందు చర్మ సమస్యలు, అలెర్జీలు ఉంటె తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా స్కిన్ స్పెషలిస్ట్ ను సంప్రదిస్తే మంచిది.
(Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)
Also Read: Chinese Man: మందు, సిగరెట్ వద్దు అన్నదని భార్య మీద అలిగి.. గత 14 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్ లోనే జీవనం