- Telugu News Photo Gallery Skin Care Tips make face mask or packs of green coriander leaves with these ingredients
Skin Care Tips: పచ్చి కొత్తిమీరతో అదరిపోయే అందం మీసొంతం.. ఎలా ఉపయోగించాలంటే..?
Coriander leaves for face: కొత్తిమీరలో ఆహార రుచిని పెంచే గుణాలతోపాటు అందాన్ని పెంచే పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కొత్తమీరను మీ చర్మ సంరక్షణలో చేర్చుకుంటే.. ఎన్నో ఫలితాలను పొందవచ్చు. ఎలాంటి పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.
Updated on: Mar 30, 2022 | 7:02 AM

కొత్తిమీర - కలబంద: అలోవెరా చర్మ సంరక్షణలో ఉత్తమమైనది. దీంతోపాటు పచ్చి కొత్తిమీరను మంచి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చి కొత్తిమీర ఆకుల పేస్ట్ వేసి.. అందులో రెండు చెంచాల అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీంతో ముఖంపై వచ్చే ముడతలు తొలగిపోతాయి.

కొత్తిమీర - బియ్యం పిండి: ఈ మాస్క్ కోసం ఒక గిన్నెలో కొత్తిమీర ఆకుల పేస్ట్ తీసుకొని దానికి ఒక చెంచాల బియ్యం పిండిని మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. కాసేపు ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

కొత్తిమీర - పెరుగు: అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న పెరుగులో చర్మ సంరక్షణకు సంబంధించిన అనేక పోషకాలున్నాయి. పచ్చి కొత్తిమీర ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి అందులో రెండు చెంచాల పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఒక గంట ఉంచాలి. అనంతరం నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొత్తిమీర - తేనె: వేసవిలో మీ చర్మం పొడిగా ఉంటే కొత్తిమీర పేస్ట్‌లో తేనె మిక్స్ చేసి అప్లై చేయండి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుంచి మృదువుగా మార్చడానికి పని చేస్తాయి.

కొత్తిమీర - నిమ్మకాయ: ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉంటే.. కొత్తిమీర నిమ్మకాయకు సంబంధించిన మాస్క్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం కొత్తిమీర పేస్ట్‌లో అర టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. కొంత సమయం తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)




