- Telugu News Photo Gallery World photos London Woman with grey hair shows off new look after ditching hair dye and becomes famous
Silver Hair: పెళ్లిరోజున తెల్ల జుట్టువిషయంలో తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం
Silver Hair: చిన్నప్పటి నుండే జుట్టు తెల్లబడటం ప్రారంభించి 20-25 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి సగానికి పైగా జుట్టు తెల్లగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో.. వీరిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అయితే ఏ మహిళ తెల్లని జుట్టు కారణంగా ప్రపంచం ఈమె గురించి తెలుసుకోవడం ప్రారంభించిం. ఆమె గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Updated on: Mar 29, 2022 | 9:05 PM

ఈరోజు లో ఎక్కువమంది తమ నెరిసిన జుట్టును దాచుకోవడానికి జుట్టుకి రంగు వేయడం సర్వసాధారణంగా మారింది. కొందరు తమ జుట్టుకు నల్లని రంగు వేసుకుంటే మరింకొందరు బ్రౌన్ రంగుని వేసుకుంటారు. వాస్తవానికి చాలామంది తమ తెల్ల జుట్టుని ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.అయితే ఇప్పుడు ఒక మహిళ గురించి ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చ జరుగుతోంది, ఆమె తెల్ల జుట్టుతో ఇబ్బంది పడింది.. కానీ ఇప్పుడు ప్రజలు ఆమెను ప్రశంసించడం ప్రారంభించారు.

ఆ మహిళ పేరు ఎమిరియానా లిట్సా. ప్రస్తుతం, ఆమె వయస్సు 34 సంవత్సరాలు, అయితే ఆమె వయసు 11 సంవత్సరాల ఉన్నప్పటి నుంచే జుట్టు తెల్లబడటం ప్రారంభించింది. దీంతో ఆమె తన జుట్టుకు నలుపు లేదా గోధుమ రంగు వేయడం ప్రారంభించింది

మిర్రర్ యొక్క నివేదిక ప్రకారం.. ఎమిరియానా పాఠశాలలో ఉన్నప్పుడు, తెల్ల జుట్టు కారణంగా ఆమె విశ్వాసంపై ప్రభావం చూపించింది. అందుకే ఎవరికీ తెలియకుండా 2 వారాలకొకసారి తన జుట్టుకు నలుపు రంగు వేసుకునేది.

అయితే, తన 30వ పుట్టినరోజున.. ఎమిరియానా తన జుట్టుకు మళ్లీ రంగు వేయకూడదని తెల్లగా ఉంచాలని నిర్ణయించుకుంది. 2018 సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 4 సంవత్సరాలు గడిచాయి అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎమిరియానా తన జుట్టకి రంగు వేయడానికి సెలూన్‌కి వెళ్లలేదు

తన వివాహంలో కూడా.. ఎమిరియానా తన జుట్టు సహజ రంగులో ఉండాలనుకుంది. అంటే తెలుపు రంగులోనే ఉండాలని భావించింది. దీంతో ఇప్పుడు ప్రజలు ఆమె విశ్వాసాన్ని చాలా ప్రశంసిస్తున్నారు. జుట్టు నలుపైతేనేమి, తెలుపు అయితేనేమి తేడా లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




