RCB vs KKR, IPL 2022: ఫైర్ మీదున్న ఆర్‌సీబీ బౌలర్ హసరంగా.. కేకేఆర్ బ్యాటర్లపై నిప్పుల వర్షం..

ఈరోజు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేస్తోన్న కేకేఆర్ అష్టకష్టాలు పడుతోంది.

RCB vs KKR, IPL 2022: ఫైర్ మీదున్న ఆర్‌సీబీ బౌలర్ హసరంగా.. కేకేఆర్ బ్యాటర్లపై నిప్పుల వర్షం..
Ipl 2022 Royal Challengers Bangalore Bowler Wanindu Hasaranga
Follow us
Venkata Chari

|

Updated on: Mar 30, 2022 | 8:51 PM

ఈరోజు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేస్తోన్న కేకేఆర్ అష్టకష్టాలు పడుతోంది. క్రీజులో నిలవడమే బ్యాటర్లకు కష్టమైంది. ప్రస్తుతం14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 99 పరగులు చేసింది. 14 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ టీం.. 32 పరుగుల వద్ద రెండు, 44 వద్ద మూడు, 46 వద్ద 4, 67 వద్ద 5, 67 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. 83 పరుగుల వద్ద ఏడు, 99 వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పో్యింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో వసిందు హసరంగా 3 వికెట్లు, ఆకాష్ దీప్ 2, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.

మైదానంలో మంటలు పుట్టించిన హసరంగా..

శ్రీలంకకు చెందిన వసిందు హసరంగా ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరుగుతూ బౌలింగ్ చేశాడు. తన 3 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కీలక వికెట్లు పడగొట్టి కేకేఆర్ బ్యాటర్స్‌ను క్రీజులో నిలదొక్కుకోనివ్వకుండా చేశాడు. నితీష్ రాణాను 5.5 ఓవర్లో టీం స్కోర్ 44 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చిన హసరంగా, 6.4 ఓవర్లో టీం స్కోర్ 46 పరుగుల వద్ద కేకేఆర్ సారథి శ్రేయాస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత 67 పరుగుల వద్ద 8.5 ఓవర్లో సునీల్ నరైన్‌ను పెవిలియన్ చేర్చాడు.

పవర్ ప్లేలో KKR బ్యాటర్ల ముందు ఫాఫ్ ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించాడు. ప్రత్యేక ఫీల్డింగ్ సెట్ చేయడంతో వెంకటేష్, రహానే, రానా, అయ్యర్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. అయ్యర్ కోసం, అతను డీప్ పాయింట్, డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డర్‌ను ఉంచాడు. ఆకాశ్ దీప్ వేసిన మూడో ఓవర్లో 14 బంతుల్లో 10 పరుగుల వద్ద వెంకటేష్ ఔటయ్యాడు. 10 బంతుల్లో 9 పరుగులు చేసిన తర్వాతి ఓవర్‌లోనే రహానే వికెట్ కూడా కోల్పోయాడు. అజింక్యా వికెట్‌ను మహ్మద్ సిరాజ్ తీయగా, డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్‌లో షాబాజ్ అహ్మద్ క్యాచ్ పట్టాడు.

కపిల్‌ని గుర్తు చేసిన విల్లీ..

కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో, షార్ట్ ఫైన్ లెగ్ వెనుక పరుగెత్తుతున్న డేవిడ్ విల్లీ, నితీష్ రాణా అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. విల్లీకి ముందు, ఇదే టోర్నమెంట్‌లోని నాల్గవ మ్యాచ్‌లో, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ కూడా లక్నో సూపర్ జెయింట్స్‌పై 31 మీటర్ల వెనుకకు పరిగెడుతూ దాదాపు అలాంటి క్యాచ్‌ను అందుకున్నాడు. విల్లీ, గిల్‌ల క్యాచ్‌లను చూసిన అభిమానులకు 1983 ప్రపంచకప్ ఫైనల్‌లో కపిల్ దేవ్ మ్యాచ్ ఛేంజింగ్ క్యాచ్ పట్టిన దృశ్యం గుర్తుకు వచ్చింది.

ప్లేయింగ్ XI:

RCB: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హస్రంగ, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

KKR : అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం