- Telugu News Photo Gallery Cricket photos Ipl 2022 8 batsmens out for duck in first 5 matches including kl rahul shubman gill nicholas pooran
IPL 2022: ఈ సీజన్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన 8మంది బ్యాట్స్‌మెన్స్.. లిస్టులో రూ. 17 కోట్ల ఆటగాడు..
IPL 2022 మొదటి ఐదు మ్యాచ్‌లలో, మొత్తం 8 మంది బ్యాట్స్‌మెన్ సున్నాకి పెవిలియన్ చేరారు. వీరిలో ఫ్రాంచైజీలు రూ.17 కోట్ల వరకు వెచ్చించిన బ్యాట్స్‌మెన్‌లు కూడా ఉన్నారు.
Updated on: Mar 30, 2022 | 7:52 PM

ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఎన్నో తుఫాన్ బ్యాటింగ్‌లు చూశాం. ఓడిన్ స్మిత్ పవర్ హిట్టింగ్, సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్, దీపక్ హుడా ఫాస్ట్ షాట్‌లతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. అయితే, లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయిన కొందరు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

IPL 2022 మొదటి ఐదు మ్యాచ్‌లలో, మొత్తం 8 మంది బ్యాట్స్‌మెన్ సున్నాకి పెవిలియన్ చేరారు. వీరిలో ఫ్రాంచైజీలు రూ.17 కోట్ల వరకు వెచ్చించిన బ్యాట్స్‌మెన్‌లు కూడా ఉన్నారు.

ఐపీఎల్ 2022లో తొలి బంతికే ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఔట్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే ఔట్ అయిన లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఇందులో కీలకమైన పేరు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రాజ్ బావా కూడా RCBపై మొదటి బంతికి ఔటయ్యాడు.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ నాలుగో బంతికి వికెట్ కోల్పోయిన అతను ఖాతా కూడా తెరవలేకపోయాడు. ముంబై ఇండియన్స్‌పై ఇద్దరు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ మన్‌దీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్ ఇద్దరూ సున్నాతో సరిపెట్టుకున్నారు.

లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి సున్నా పరుగులతో సరిపెట్టుకున్నారు.




