AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా ?.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..

Chiranjeevi comments on Politics: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు రాజకీయాల్లోకి వెళ్లడంపై, ఆ తర్వాత పరిస్థితులపై మాట్లాడిన చిరంజీవి..

Chiranjeevi: రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా ?.. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్..
Chiranjeevi
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 31, 2022 | 7:00 AM

Share

Chiranjeevi comments on Politics: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు రాజకీయాల్లోకి వెళ్లడంపై, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై చిరంజీవి పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కొన్నిసార్లు రాజకీయాల్లోకి ఎందుకెళ్లానా’ అనిపిస్తుందంటూ పేర్కొన్నారు. మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible) సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్‌లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. తాప్సీ కీలక పాత్రలో దర్శకుడు స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జె. తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్‌’ ఏప్రిల్‌ 1న రిలిజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం బుధవారం రాత్రి నిర్వహించిన ప్రీ రిలిజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తాప్సీ (Taapsee Pannu ) లాంటి కథానాయికలతో నటించలేకపోయినందుకు తాను ఫీలవుతుంటుంటానని పేర్కొన్నారు. వారిని చూస్తుంటే రాజకీయాల్లోకి ఎందుకెళ్లానా..? అనిపిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. తాప్పి నటించిన చిత్రాలు చూసినప్పుడు క్యూట్‌గా ఉండే తాప్సీ ఇంత పవర్‌ఫుల్‌గా నటించిందా.. అనే సందేహం కలుగుతుంటుందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తనతో నటించే అవకాశాన్ని చేజిక్కించుకోలేదంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తుంటుందని చిరంజీవి పేర్కొన్నారు.

నిర్మాత నిరంజన్‌ మీద ఉన్న ప్రేమతోనే తాను ఈ ఈవెంట్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిత్రం నిర్మించారనే విషయం తెలిసి ఆశ్చర్యపోయానని.. ఈ చిత్రంలో తాప్సీ పాత్ర చాలా అద్భుతంగా ఉందని మెగాస్టార్ పేర్కొన్నారు. ఇది చిన్న సినిమా కాదని అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా అంటూ చిరంజీవి పేర్కొన్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై కూడా మెగాస్టార్ మాట్లాడారు. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారని కొనియాడు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి అభినందించారు.

కాగా.. అంతకుముందు పలుమార్లు రాజకీయాలపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టంచేశారు. ఇటీవల సినిమా టికెట్ల ధరల విషయం ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను చిరంజీవి కలిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సీఎం జగన్ చిరంజీవికి రాజ్యసభ టిక్కెట్ ఆఫర్ చేశారని.. వైసీపీ నుంచి ఎగువసభకు వెళ్తారంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై స్పందించిన చిరంజీవి.. అవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టంచేశారు. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. విషయాలను పక్కదోవ పట్టించే విధంగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని చిరు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read:

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..