AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..

బుల్లితెరపై టాప్ యాంకర్‏‏గా రాణిస్తోంది అనసూయ భరద్వాజ్ (Anasuya). ఓవైపు పలు షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు వెండితెరపై

Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..
Anasuya
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2022 | 7:17 AM

Share

బుల్లితెరపై టాప్ యాంకర్‏‏గా రాణిస్తోంది అనసూయ భరద్వాజ్ (Anasuya). ఓవైపు పలు షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు వెండితెరపై సత్తా చాటుతోంది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం దర్జా (Darja). ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‏గా రూపొందుతోన్న చిత్రాన్ని కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. తాను చీర కట్టిన సివంగిని అంటూ అనసూయ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నారు. ఇందులో పోలీస్ పాత్రలో సునీల్ నటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, ఏపీ ఆక్వా అసోసియేషన్ చైర్మెన్ భూమాల శ్రీరామ్ మూర్తి, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి ,కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), హీరోయిన్, శిరీష.. సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, సినిమాటోగ్రాఫర్ దర్శన్, స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, , రైటర్ భవాని ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. మా టీజర్ నురిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి థాంక్స్ తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ మూవీలో సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తున్నారు.

Also Read: Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?