Sarkaru Vaari Paata: ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు ఉగాది కానుక !!

Sarkaru Vaari Paata: ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు ఉగాది కానుక !!

Phani CH

|

Updated on: Mar 31, 2022 | 8:34 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారువారి పాట.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా వదిలిన ‘కళావతి’ పాట రికార్డు స్థాయి వ్యూస్ ను రాబడుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ గా ‘పెన్నీ’ సాంగ్ వదిలారు. మహేశ్ కూతురు సితార కూడా మెరిసిన ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూకుడు చూపుతూ వెళుతోంది. ఇక ఇప్పుడు ‘ఉగాది’ కానుకగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రానుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Watch:

News Watch: ఎండల్లో తిరగద్దు… ఆరెంజ్ హెచ్చరికలు… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్