AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

Pakka Commercial : సిటీమార్‌తో చాలా రోజుల తర్వాత కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు గోపిచంద్‌ (Gopi chand). ఇప్పుడు తన విజయ పరంపరను అలాగే కొనసాగించాలనుకుంటున్నాడు

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..
Pakka Commercial
Basha Shek
|

Updated on: Mar 30, 2022 | 8:55 PM

Share

Pakka Commercial : సిటీమార్‌తో చాలా రోజుల తర్వాత కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్నాడు గోపిచంద్‌ (Gopi chand). ఇప్పుడు తన విజయ పరంపరను అలాగే కొనసాగించాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి (Maruthi) డైరెక్షన్‌లో పక్కా కమర్షియల్‌ అనే సినిమా చేస్తున్నాడు. జిల్‌, ఆక్సిజన సినిమాల తర్వాత మూడోసారి రాశీఖన్నా (Rashi Khanna) గోపీచంద్‌తో జోడీ కడుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా గోపీచంద్ – మారుతి కాంబినేష‌న్ లో సినిమా అనౌన్స్ మెంట్ చేసినప్పటినుంచే ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మూవీ టైటిల్‌కు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా మ్యాచోస్టార్‌ 29వ చిత్రంగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్‌ అందించారు దర్శక నిర్మాతలు. ప‌లు సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాను జులై 1 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

కాగా ప్రతిరోజు పండగే లాంటి హిట్‌ తర్వాత కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా పక్కా కమర్షియల్‌ సినిమాను రూపొందిస్తున్నారు మారుతి. హీరో హీరోయిన్లతో పాటు అనసూయ భరద్వాజ్, రావు రమేశ్‌, సత్యారాజ్‌, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జకేస్ బీజాయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతో పాటు శ్రీవాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు గోపీచంద్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో లక్ష్యం లాంటి సూపర్‌ హిట్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాశీఖన్నా కూడా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె బాలీవుడ్‌లో నటించిన రుద్ర అనే వెబ్‌ సిరీస్‌ కూడా విడుదలై మంచి విజయం సాధించింది.

Also Read:Telangana: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. స్కూళ్ల పనివేళలు కుదింపు..

RCB vs KKR, IPL 2022: ఫైర్ మీదున్న ఆర్‌సీబీ బౌలర్ హసరంగా.. కేకేఆర్ బ్యాటర్లపై నిప్పుల వర్షం..

Drinking Water: వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..