Telangana: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. స్కూళ్ల పనివేళలు కుదింపు.. షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో హాఫ్‌ డే స్కూల్‌ టైమింగ్స్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana: తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. స్కూళ్ల పనివేళలు కుదింపు.. షెడ్యూల్ ఇదే
Telangana Schools
Follow us
Ram Naramaneni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Mar 30, 2022 | 9:51 PM

Telangana school schedule: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాఠశాల సమయాన్ని మరింత తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. పిల్లలు ఎండ బారిన పడకుండా స్కూల్‌ టైమింగ్స్‌ను ఇంకా తగ్గించాలని ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూళ్లు నడుస్తున్నాయి. ఈ సమయాన్ని తగ్గించారు. రాష్ట్రంలోని పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు ఏప్రిల్ 7 నుంచి 16 వరకు 1నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 23న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

కాగా.. రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ(nalgonda), సూర్యాపేట(Suryapet), నిజామాబాద్‌(Nizamabad)లో ఉష్ణోగ్రతలు రెండు నుండి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎస్‌ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లు, హాస్పిటల్స్‌లో డాక్టర్లు, స్టాఫ్‌ అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. సరిపడా ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఎండల తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపర్చాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అలర్ట్‌గా ఉండాలన్నారు.

Also Read: Viral Video: నడిరోడ్డుపై దగ్ధమైన మరో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే కంగుతింటారు